అంతు చిక్కని నిధి కథ 1 ఇది ఇప్పటి నుండి 1760 సంవత్సరాల క్రితం జరిగిన నిధి వేట గురించి ఇప్పుడు వెతుకుతున్న పురావస్తు శాఖ అధికారులు మిస్సింగ్ కేసుల గురించి
మూఢనమ్మకాలు…వాటి ప్రభావం తో బలైన ఊర్ల గురించి…
ఈ case ni solve చేయడానికి వచ్చిన నా fav role Sandhya ఇందులో మరొక్కసారి మెయిన్ రోల్…
మీకు ఈ స్టోరీ నచ్చుతుంది అని అనుకుంటూ
ఈ కథ 4 వ శతాబ్దం లో జరిగిన ఒక ఆధిపత్య పోరులో ఓడిన అంబి రాజు ఇంక అతని మీద గెలిచిన నంబియార్ మధ్య యుద్ధం తర్వాత జరిగిన సంఘటన మీద ఆధారపడి ఉంటుంది…
అంబి కి రాజు అయిన హంశనందుడు యుద్ధం లో ఓడిపోయిన తరువాత తన రాజ్యాన్ని కోల్పోతాడు .
నంబియార్ తన చిన్ననాటి స్నేహితుడు కావటం వల్ల నండుడిని
చంపకుండా ప్రాణాలతో వదిలేశాడు అందుకు ప్రతిఫలంగా నందుడి దగ్గర ఉన్న విలువైన సంపద నీ ఇవ్వాల్సింది గా షరతు పెట్టాడు..
అందుకు అంబీ రాజు మొదట అంగీకరించిన తర్వాత ఆ సంపద నంబియార్ చేతికి చిక్కకుండా daachipettalani అందుకు తగ్గ వ్యక్తి అయిన అతని సైనికాధికారి విరిజిత్తు కి ఆ పని అప్పగించాడు…
విరీజిత్తు తన దగ్గర ఉన్న ఎంతో సమర్ధవతంగా ఉన్న 1000 మంది సైనికులతో బయలుదేరాడు …ఆ సంపద ఎక్కడ daachipettalo కేవలం నందుడికి ఇంక విరిజీత్తు కి మాత్రమే తెలుసు..
ఒక పక్షం రోజుల ప్రయాణం తర్వత సైనికులు సుమారు 250 మైళ్ళు ప్రయాణించి ఒక అందకారణ్యం కి చేరుకున్నారు….
విరిజితు….ఓహో అశోక ఇటు రా ఒక సారి అని అతని 17 ఏళ్ల కొడుకుని పిలిచాడు
అశోకుడు…గుర్రానికి దాన పెడుతూ తండ్రి పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు.. తండ్రి గారు చెప్పండి పిలిచినందుకు గల కారణం
విరీజితు…చూడు నాయనా మనం ఇప్పుడు ఈ అడవి గుండా వెళ్ళడం అంత మంచిది కాదు ఇక్కడ ఉండే అతీంద్రియ శక్తులు మనల్ని చంపేస్తాయి.నాకు ఉన్న ఒకే దిక్కు నువ్వు నిన్ను నేను కోల్పోవడం కోసం సిద్ధంగా లేను కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా విను ఇక్కడికి 7 మైళ్ళు కుడి వైపు ప్రయాణం చేస్తే అక్కడ అనుయారు అనే చిన్న గ్రామం వస్తుంది అది దాటుకొని వస్తె ఈ అడవికి అవతలి వైపు రావచ్చు .కానీ ఈ సంపద తో నేను అటు నుంచి రాలేను ఎందుకంటే అటు నంబియార్ రాజు సామ్రాజ్య పరిధి
మనం ఈ సంపద తరలిస్తున్న సంగతి తెలిస్తే అందరినీ చంపేస్తాడు కాబట్టి నువ్వు ఒక 300 మంది సైనికులతో వెళ్ళు నేను మిగిలిన వాళ్ళని వెంటబెట్టుకొని ఈ అడవి దాటి ఎలాగైనా బయట పడుతాను
అశోకుడు…కానీ తండ్రి గారు మీరు ఆ ఊరిలో నుండి వెళ్లొచ్చు కదా నేను ఈ సంపద తో అడవి గుండా వెళ్తాను
అశోకుడు చెప్పిన దానికి అతని తండ్రి కొప్పడి నాకే ఎదురు చెప్తావా నీకు ఎంత ధైర్యం అని అరుస్తాడు…
తండ్రి మాటలకి భయపడి మారు మాట్లాడకుండా కొంత మంది సైనికులతో ఊరి వైపు ప్రయాణం మొదలుపెట్టాడు…
episode – 1
episode – 2
మిగిలిన ఆడియో స్టోరీల కొరకు క్రింది లింక్ ను క్లిక్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఉచితంగా ఆడియోలను వినండి