ఆదివారం రాత్రి 9 గంటలు 1 ఢిల్లీ : × : 2007వ సంవత్సరం షారుఖ్ ఖాన్ చక్ దే ఇండియా రిలీజ్ అయ్యి వారం అవుతుంది. థియేటర్ నుంచి వంద మీటర్ల దూరంలో ఉన్న స్కూల్లో క్లాస్ లో చివరి బెంచీలో కూర్చుని టీచర్ ఏదో చెపుతుంటే వింటున్నట్టు నటిస్తుంది పన్నెండేళ్ల యుక్తి, ఎప్పుడెప్పుడు స్కూల్ అయిపోతుందా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లి తన నాన్న దెగ్గర బాక్సింగ్ నేర్చుందామా అని తెగ ఎదురుచూస్తుంది.
అస్సలు నేను చదువుకోను నాన్నా నీలాగే పెద్ద బాక్సర్ నవుతా అని గోల గోల చేసింది కానీ నువ్వు చదవాలని అమ్మ కోరుకుందని ఆయన చెపితే ఇష్టం లేకపోయినా, కాన్సర్ తో పోరాడి ఓడిపోయిన తన అమ్మ కోసం చదువుకోవడానికి ఒప్పుకుంది.
తల్లి లేని పిల్ల అయినందువల్ల కొంచెం గారాబం ఎక్కువైనా యుక్తి ఎప్పుడు శృతి మించి ప్రవర్తించలేదు. తల్లి తండ్రి అంటే ఎంత గౌరవం ఉందొ అంతే అల్లరి పిల్ల, తన అల్లరంతా నాన్న దెగ్గరే చూపిస్తుంది తప్ప ఎవ్వరిని ఇబ్బంది పెట్టేది కాదు.
పొడుగు జుట్టు అయితే బాక్సింగ్ కి ఇబ్బంది అవుతుందని జుట్టు పెంచుకోలేదు, క్రాఫ్ కటింగ్ చేపించుకుంటుంది.. దాని వల్ల స్కూల్లో పెద్దగా స్నేహితులు ఏర్పడలేదు.. ఎప్పుడూ ఒంటరిగానే కూర్చుంటుంది, తనతో మాట్లాడడానికి ఎవరు లేకపోయినా తనకే బాధ లేదు.. అదే మంచిదిలే అనుకుంది.
స్కూల్లో రోజూ తనని ఏడిపించడానికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అందులో ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కూతురు మొదటిది. ఒకసారి వాళ్ళు తన అమ్మని అన్న మాటలు తట్టుకోలేక గొడవ పడితే యుక్తి నాన్నకి కంప్లైంట్ ఇచ్చారు, తన వల్ల నాన్న అందరి ముందు తల దించుకోవడం, మాట పడడం ఇష్టంలేక ఇక యుక్తి అస్సలు వాళ్ళని పట్టించుకునేది కాదు.. వాళ్ళు దానిని అవకాశంగా తీసుకుని ఇంకా రెచ్చగొట్టేవారు.. ఏమన్నా మౌనంగా పిడికిలి బిగించుకుని కోపం అనగబట్టుకుని అక్కడినుంచి వెళ్లిపోయేది.
స్కూల్ అయిపోయిన వెంటనే బ్యాగ్ అందుకుని లేచింది ఆనందంగా.. ఇది చూసిన ప్రిన్సిపాల్ కూతురు వెంటనే కాలు అడ్డం పెట్టింది.. చూసుకోకుండా పరిగెత్తినందుకు యుక్తి కాలు తట్టుకుని రెండు రౌండ్లు దొల్లుతూ గోడకి గుద్దుకుంది. క్లాస్ లో ఉన్న అందరూ నవ్వడం మొదలుపెట్టారు, కోపంగా లేచింది యుక్తి కానీ ఎమ్మటే మామూలు అయిపోయి అక్కడినుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి థియేటర్లో పని చేస్తున్న తన నాన్న దెగ్గరికి వెళ్లి ఆయనకి సహాయం చెయ్యడం మొదలుపెట్టింది.
రోజూ ఇంతే పొద్దున్నే బాక్సింగ్ కి సంబంధించిన కసరత్తులు, ఆ తరవాత తండ్రి కూతుళ్లు ఇద్దరు లంచ్ బాక్సులు తీసుకుని థియేటర్ కి స్కూల్ కి వెళ్ళిపోతారు. యుక్తి స్కూల్ అయిపోగానే తన నాన్న దెగ్గరికి వెళ్ళిపోయి ఆయన ప్రాజెక్షన్ రూంలో పని చేస్తుంటే సహాయం చేస్తుంది. తను సాధించలేకపోయిన దానిని తన కూతురు సాధిస్తుందన్న గట్టి నమ్మకం యుక్తి నాన్నకి అందుకే ఇంటికి వచ్చాక చీకటి పడేవరకు బాక్సింగ్ ప్రాక్టీస్ చేసి రాత్రికి వండుకుని తినేసి నిద్రపోతారు. ఇదే తండ్రి కూతుళ్ళ దినచర్య.
అదే థియేటర్లో చక్ దే ఇండియా సినిమా వంద రోజులు ఆడిన సందర్బంగా షారుక్ ఖాన్ మరియు అతని టీం థియేటర్ ని సందర్శించడానికి వస్తున్నారు. ఆ రోజంతా కోలాహలంగా ఉంది యుక్తి కి కూడా ఎప్పుడెప్పుడు స్కూల్ అయిపోతుందా ఎప్పుడెప్పుడు షారుఖ్ ఖాన్ ని చూద్దామా అని తెగ ఎదురుచూస్తుంది. స్కూల్ అయిపోగానే బ్యాగ్ అందుకుని లేచింది కానీ టీచర్ యుక్తిని వెళ్లానివ్వకుండా ఆపేసింది. బెల్లు కొట్టేసినా తననే కాదు స్కూల్లో ఉన్న పిల్లలెవ్వరిని బైటికి పంపించడంలేదు.
టీచర్లంతా అయోమయంలో హడావిడి పడుతున్నారు.. భయపడుతున్నారు.. యుక్తికి ఏం చెయ్యాలో అర్ధంకాలేదు, అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయింది. బ్యాగ్ బెంచి మీదె వదిలేసి సరిగ్గా టీచర్ అటు తిరిగిన వెంటనే ఒక్క ఉదుటున బైటికి పరిగెత్తింది, పిల్లలంతా కలిసి టీచర్ కి తన మీద చెప్తారని తెలుసు, వేగంగా పరిగెత్తింది కానీ స్కూల్ గేట్లు మూసేశారు.. చాలా మంది పుల్లీసులు కాపలా ఉన్నారు.. భయం వేసి బాత్రూం వైపు పరిగెత్తింది.. ఎమ్మటే గోడ ఎక్కి అటు వైపుకి దూకేసి ఏదైతే అది అయిందిలే రేపు చూసుకోవచ్చు అని షారుక్ ఖాన్ కోసం థియేటర్ వైపు పరిగెత్తింది.
దూరం నుంచి పొగలు, మంటలు కనిపిస్తుంటేనే భయం వేసి ఇంకా వేగంగా పరిగెత్తింది.. బైట అంతా పుల్లీసులు, ఇంకొంత మంది నల్ల డ్రెస్ వేసుకుని యూనిఫామ్ లో గన్స్ పట్టుకుని ఉన్నారు. థియేటర్ అంతా మంటలతో కాలి బూడిద అవుతుంది, అస్సలు మెయిన్ గేటే లేదు, చుట్టూ అంతా శవాలు, రక్తం.. తన నాన్న కోసం అటు ఇటు చూసింది.. ఇంతలో లోపల కాల్పులు జరుగుతున్న శబ్దాలు, బాంబులు పేలిన శబ్దాలు వినిపించగానే యుక్తి కాళ్ళు గజగజ వణికిపోయాయి.. అంతా చూసింది నాన్న కనిపించలేదు.. ఆయన ఎలా ఉన్నాడో అన్న భయం.. ప్రాజెక్షన్ రూంకి వెళ్లాలంటే నేరుగానే వెళ్ళాలి, వేరే దారి లేదు.. కళ్ళు మూసుకుని అందరూ చూస్తుండగానే మంటల్లో పడి లోపలికి పరిగెత్తింది, వెనక అందరూ అరుస్తున్నా పట్టించుకోలేదు.. లోపలికి వెళ్ళిపోయింది.
మెట్లు ఎక్కి లోపలికి వెళుతుండగానే లోపల ఉన్న ఒకడు యుక్తిని చూసి గన్ తనకి పెట్టాడు, అది చూసినా యుక్తి పరుగు ఆగలేదు.. తన నాన్నని చూసేంతవరకు పరుగు ఆపకూడదనుకుంది.. వాడు కాల్చినా ఆ బుల్లెట్ యుక్తికి తగల్లేదు.
యుక్తి నేరుగా ప్రాజెక్షన్ రూం లోపలికి వెళ్ళింది, ఎదురుగా ముగ్గురు చచ్చిపడి ఉన్నారు. యుక్తి వాళ్ళ నాన్న మోకాళ్ళ మీద కూర్చుని ఉంటే ఇద్దరు గన్స్ తో మొహం మీద కొడుతున్నారు. అది చూసి భయంతో అక్కడే ఆగిపోయింది.
చెప్పు.. బోలో లవ్ జిహాద్ అని చెప్పు.. నిన్ను వదిలేస్తా
నోట్లో నుంచి వస్తున్న రక్తాన్ని వాడి మొహం మీద ఊసాడు కోపంగా, వాడూ అంతే కోపంగా తేరి మాకిచూత్ అంటూనే యుక్తి నాన్న భుజం మీద కాల్చాడు.. తట్టుకోలేకపోయింది యుక్తి.. నాన్నా అని అరుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. అక్కడున్న వాడు వెంటనే యుక్తిని పట్టుకుని వెనక్కి లాగాడు.. యుక్తి తప్పించుకోబోయి వాడిని కొట్టబోతే గూబ గుయ్యమనెలా లాగి పెట్టి కొట్టాడు ఒక్కటి.. ఇంకొకడు అది చూసి నవ్వుతూ యుక్తి జుట్టు పట్టుకుని లాగి మోకాళ్ళ మీద కూర్చోబెట్టాడు.
ప్లీజ్ చోడ్ దొ చోటి బచ్చి హే వో అని కాళ్ళ మీద పడి బతిమిలాడాడు యుక్తి వాళ్ళ నాన్న
రాక్షసంగా నవ్వుతూ.. అబ్ ఝాకే రే తేర సర్.. బోల్ అబ్ బోల్.. సాలె.. జిందాబాద్ జిందాబాద్.. పాకిస్థాన్ జిందాబాద్.. బోల్ సాలె వర్ణా మార్ధుంగా ఇస్కో అని గాల్లో రెండు రౌండ్లు షూట్ చేసి గన్ యుక్తి తలకి పెట్టాడు.
యుక్తి నాన్న ఏడుస్తూనే వాడి కాళ్ళ మీద పడ్డాడు.. అప్పుడు కనిపించింది యుక్తికి తన నాన్న రెండు మోకాళ్ళ మీద షూట్ చేశారు, రక్తం కారుతుంది.. కోపం వచ్చి గింజకుంటుంటే గట్టిగా జుట్టు పట్టుకున్నాడు.. యుక్తి నాన్న తన కూతురిని వదిలేయ్యమని బతిమిలాడుతూనే జిందాబాద్ జిందాబాద్ పాకిస్తాన్ జిందాబాద్ అని ఆపకుండా అరుస్తుంటే.. ఆ ఇద్దరు గట్టిగా నవ్వుతూ యుక్తి కళ్ళేదురుగానే తన నాన్న గుండెల్లో తూట్లుగా కాల్చేశాడు.
ఆయన చనిపోతూ కూడా యుక్తిని వదిలెయ్యమని ప్రాధేయపడుతూనే వాడి కాళ్ళ మీద పడి చనిపోయాడు.. యుక్తి గట్టిగా ఏడుస్తూనే ఉంది.. తన జుట్టు వదిలేయగానే నాన్నని పట్టుకుని లేపడానికి ప్రయత్నిస్తుంటే యుక్తిని కూడా కాల్చేద్దామని తన తలకి గన్ పెట్టి ట్రిగ్గర్ నొక్కుతుంటే అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చిన ఒకడు [యన్ యస్ జి] ఆగయా చలో చలో అని అరిచాడు.. అంతే ఆ ఇద్దరు అక్కడ నుంచి వాడి వెనకాల సీరియస్ గా వెళ్లిపోయారు. తన నాన్న గుండెలో బుల్లెట్లు దించిన వాడి మొహాన్ని వాడు అక్కడ నుంచి వెళ్లిపోయేంత వరకు చూస్తూనే ఉంది యుక్తి.
వారం గడిచింది, ఎటాక్ షారుఖ్ ఖాన్ మీద కాదని.. ఇది కేవలం సరదాగా ఇండియాకి ఒక హెచ్చరిక ఇవ్వాలని మాత్రమే చేసిన ఉన్మాదమని అన్ని పత్రికలు పేరుకొన్నాయి.
కాల్పుల్లో చనిపోయిన కుటుంబాలని గవర్నమెంట్ ఆదుకుంది.. యుక్తి లాంటి కొంతమంది అనాధలైన పిల్లల్ని సొసైటీకి అప్పగించ్చింది. పది రోజుల తరువాత యుక్తి మళ్ళీ అదే స్కూల్ కి వెళ్ళింది. తన నాన్న పోయిన క్షణం నుంచి తన మనసులో తన మెదడులో కనిపిస్తున్న ఒకేఒక దృశ్యం తన నాన్నని చంపినవాడి మెహం.. అదొక్కటే గుర్తుంది.. అదొక్కటే
స్కూల్లో శ్రద్దగా ఉండకపోయినా ఎవరు యుక్తిని ఏమనలేదు, తన కళ్ళ నుంచి కన్నీరు కారుతూనే ఉంది. తన నాన్న చేతికి అమ్మ తొడిగిన కంకణం మాత్రమే తనకి మిగిలింది. దాన్ని చూస్తుంటే నాన్న అమ్మ గురించి తన గురించి రోజూ చెప్పే కధలే గుర్తుకు వచ్చాయి..
పదే పదే తన నాన్నని గుర్తుకు తెచ్చుకుని ఏడుస్తుంటే అది చూసిన ప్రిన్సిపాల్ కూతురు వచ్చి తమాషా చేస్తూ వెక్కిరిస్తూ వెటకారంగా ఓదార్చబోయింది.. తన నాన్నని చంపిన వాడి మీద ఉన్న కోపం అంతా ఈ పిల్ల మీద చూపించింది యుక్తి.
కోపంగా లేచి బాక్సింగ్ చెయ్యితొ ఆ అమ్మాయి కనత మీద కొడితే, ఒక్క దెబ్బకి స్పృహ తప్పి పడిపోయింది, తన వెనకే ఉన్న అమ్మాయి భయపడిపోగా అదే ఊపులో ఆ అమ్మాయి కడుపులో కూడా ఒక్కటి తన్నింది.. చూస్తున్న వారందరికి చెమటలు పట్టేసాయి.. అక్కడే చూస్తున్న టీచర్ ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదంటే ఎంత భయపడిందొ అర్ధం చేసుకోవచ్చు, టీచర్ వెంటనే ప్రిన్సిపాల్ రూంకి పరిగెత్తింది.. ఇది సహించలేకపోయిన ప్రిన్సిపాల్ సొసైటీకి ఫోన్ చెయ్యగా వారు యుక్తిని హౌస్ అరెస్ట్ చేసేసి రూంలో బంధించేసారు. అదే రోజు రాత్రి యుక్తి అక్కడ నుంచి పారిపోయింది.
2019 : × : ప్రస్తుతం : × : హైదరాబాద్
కాలేజీ ఫ్రెషర్స్ పార్టీ జరుగుతుంది, అంతా గోలగోలగా ఉంది. వెల్కమ్ సాంగ్ పాడమని అంజన పేరుని అనౌన్స్ చేసింది యాంకర్. పసుపు లంగా పచ్చ ఓణిలో చెవులకి బుట్ట కమ్మలతో అందంగా రెడీ అయ్యి వచ్చింది, కానీ స్టేజి ఎక్కుతుంటే చెమట పట్టడం మొదలయ్యింది తనకి. కుర్రోళ్లంతా ఒక్క నిమిషం అంజన మొహం చూడాలో నడుస్తున్నప్పుడు అటు ఇటు వయ్యారంగా ఊగుతున్న సన్నని నడుము చూడాలో అర్ధంకాక, అందినంత ద్రాక్ష దొరకబుచ్చుకునే నక్కల్లా అంజన అందాన్ని తమ కళ్ళలో నింపుకొసాగారు. ఆ కళ్ళతో ఎన్నో ఫోటోలని మనసులోనే తీసుకుని భద్రంగా దాచుకున్నారు. ఇక అమ్మాయిలైతే తమ వెంట వచ్చిన అబ్బాయిలు అలా సొంగ కార్చూతు అంజనని చూస్తుండడం చూసి కోపం తెచ్చుకుని తిట్టడం కొట్టడం మొదలుపెట్టారు.
భయం భయంగానే స్టేజి ఎక్కి పాడటం మొదలుపెట్టింది, అందంతో పాటు గొంతు కూడా బాగుండటంతో చిన్నగా అందరూ చప్పట్లు కొడుతూ ప్రోత్సాహించడంతో భయం వదిలి ఇంకా బాగా పాడింది. ఆపకుండా రెండు నిమిషాల వరకు కొట్టిన ఆ చప్పట్లు, ఈలలు తన అందానికో తన పాటకో చప్పట్లు కొట్టిన వాళ్ళకే తెలియాలి.. ఎప్పుడు ఇంతలా అభినందనలు చూడని అంజనకి ఆ కేరింతలు చూసి ఆనందం వేసింది, దానితో పాటే కొంచెం సిగ్గొచ్చి ఇబ్బంది పడింది. పాట అయిపోగానే ఘాబరాగా దిగి వెళ్లిపోతుంటే డీన్ మైక్ అందుకుని అంజనని స్టేజి మీదకి పిలిచారు, అంజన వెనక్కి వచ్చి మైక్ తీసుకుని నిలబడింది.
డీన్ : చాలా బాగా పాడావు అండ్ ఐ లైక్ యువర్ డ్రెస్సింగ్ సెన్స్.. గుడ్.. గివ్ మీ యువర్ ఇంట్రడక్షన్ అన్నాడు
అంజన : నా పేరు అంజన, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ని, గాంధీ నగర్ నుంచి వస్తాను, నాన్న పేరు గిరి రైల్వేలో పని చేస్తారు, అమ్మ వాణి హౌస్ వైఫ్. నాకొక అన్నయ్య.. తన అన్నయ్య తన గురించి చెప్పొద్దని చెప్పాడు క్లియర్ గా అది గుర్తుకురాగానే కొంచెం కంగారుపడిపోయింది. ఇదే కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చేసాడు, 2015 బ్యాచ్ అని ఏదో చెప్పి ముగించి మైక్ దించి వదిలేస్తే వెళ్ళిపోతాను అన్నట్టుగా చూసింది డీన్ వంక
డీన్ : ఇంతకీ మీ అన్నయ్య పేరు చెప్పలేదు
అంజన : అదీ.. అదీ..
డీన్ : చెప్పమ్మా ఎంతసేపు
అంజన : మా అన్నయ్య చెప్పొద్దన్నాడండీ
డీన్ : యే ఎందుకు.. కొంపదీసి ఫెయిల్డ్ స్టూడెంటా అని నవ్వాడు, అక్కడున్న అందరూ నవ్వుతుంటే అంజనకి కొంచెం అవమానంగా అనిపించి కోపం వచ్చింది.
అంజన : మా అన్నయ్య పేరు గౌతమ్ అంది, అందరికీ వినిపించేలా
అంతే అందరూ సైలెంట్ అయ్యారు, కాలేజీ స్టూడెంట్స్ అంతా గుసగుసలు పెట్టుకుంటుంటే పక్కన ఉన్న స్టాఫ్ అంతా గౌతమ్ అంటూ ఏదో మాట్లాడుకుంటున్నారు, డీన్ కూడా అంజన నోటి వెంట గౌతమ్ అన్న పేరు వినిపించేసరికి ఒక్కసారి లేచి మళ్ళీ అందరినీ చూసి సర్దుకుని కూర్చున్నాడు. అంజనకి ఇదంతా అర్ధంకాకపోయినా ఎవరూ ఏమి మాట్లాడకపోయేసరికి మైక్ యాంకర్ కి ఇచ్చేసి వేగంగా స్టేజి దిగి వెళ్ళిపోయింది.
ఆరోజంతా కొత్త పరిచయాలతో, కాలేజీ అంతా తిరిగుతూ తన క్లాస్ వారిని కలిసి కాంటీన్ కి వెళ్లి అక్కడా అంతా చూసి ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలిసుకుంది, కొంతమంది తన అన్నయ్య గురించి అడిగితే ఇంకా కాళిగానే ఉన్నాడని చెప్పాల్సి వస్తుందేమో అని ఎక్కువగా ఎవరితోనూ ఎక్కువసేపు మాట్లాడలేదు, ఇద్దరు ముగ్గురు తన అన్నయ్య గురించి ఏదో చెపుతుంటే మాట దాటేసింది, ఈ అన్న గాడు ఈ కాలేజీలో ఏమేమి చేసి సచ్చాడో అనుకుంది. మధ్యాహ్నం వరకు కాలేజీలోనే గడిపేసి ఇంటికి వచ్చేసింది. ఇంట్లోకి రాగానే ముందు రూంలోకి వెళ్లి బట్టలు విప్పేసి బాత్రూంలోకి దూరి ఫ్రెష్ అయ్యి షార్ట్ టీషర్ట్ వేసుకుని వీడు ఎక్కడున్నాడో ఏంటో బలాదూర్ బసవన్న వీడికి తోడు ఇంకో నీచుడు ఆ రాజు గాడు అని తన అన్నని వాడి ఫ్రెండుని తిట్టుకుంటూ తన అమ్మ బెడ్రూంలోకి వెళ్ళింది.
అంజు : అమ్మా.. ఏం చేస్తున్నావ్
వాణి : కనిపించట్లేదా ఫాల్ కుడుతున్నాను
అంజు : ఏంటి మంచం మీదా ?? అవును, అన్నయ్య ఎక్కడా ?
వాణి : ఏమో తెలీదు
అంజు : అయినా అన్నయ్య గురించి నిన్ను అడుగుతున్నానేంటి, నాన్న ఫోన్ చేశాడా.. ఈ నెల అయినా వస్తాడా రాడా
వాణి : ఏమో మీ పిన్ని దెగ్గర ఉన్నాడేమో ఎవరికి తెలుసు
అంజు : చేతులు నడుము మీద పెట్టి వెటకారంగా చూస్తూ.. ఆయనకి.. ఇంకో పెళ్ళాం, ఉన్న ఒక్కదాన్నే సరిగ్గా చూసుకోవడం రాదు.. మళ్ళీ నాకో పిన్ని
వాణి : ఏ నన్ను చేసుకోలేదా
అంజు : మొదటి అమ్మ చనిపోయాక నిన్ను చేసుకున్నాడు
వాణి : నీకెప్పుడు అయింది అమ్మ
అంజు : నా అన్నయ్యకి అమ్మ అంటే నాకూ అమ్మే.. నువ్వు వాడిని దూరం పెడతావేమో నేను అలా కాదు, ఎందుకు అన్నయ్య అంటే పడదు నీకు.. ఎంత బాగ చూసుకుంటాడు మనల్ని, నిన్ను ఎదిరించి ఒక్క మాట కూడా మాట్లాడడు
వాణి : ఇప్పుడు కాదు, ఇదేమాట కొన్నేళ్ల తరువాత చెప్పు అప్పుడు ఒప్పుకుంటాను
అంజు : నేనెప్పుడూ ఒకేలా ఉంటాను. నాకోసం నా అన్నయ్య కూడా అలానే ఉంటాడు
వాణి : చిన్నపిల్లవి కదా నాలుగు మాయ మాటలు చెప్పుంటాడు, నమ్మేసావ్
అంజు : ఇంకేం చిన్నపిల్లని, కాలేజీకి కూడా వెళుతుంటే.. అయినా నా అన్నయ్యకి మాయ మాటలు చెప్పే అవసరం ఏముందే.
వాణి నీకిప్పుడేం అర్ధం కావులే అని నవ్వింది అంతే ఇంకేం మాట్లాడలేదు, తన చెయ్యి మాత్రం చీరకి ఫాల్ కుడుతూనే ఉంది. అంజన కూడా ఇంకేం మాట్లాడలేదు తన అమ్మతో వాదించడం కష్టమని తెలిసి మౌనంగా తన అమ్మ ఫోన్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయింది. తన రూంలోకి వెళ్లి మంచం మీద పడుకుని అన్నయ్యకి కాల్ చేసింది, ఎత్తలేదు. మళ్ళీ చేసింది ఎత్తలేదు కోపంతో మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంది.