ఆదివారం రాత్రి 9 గంటలు 2 ముంబై చివరన.. అదో పెద్ద జంక్ యార్డ్ చుట్టూ అంతా స్క్రాప్.. పాతబడిన ఆటోలు కొన్ని వందల జంక్ కార్లు, తుప్పు పట్టిన ఇనుము, దుమ్ములో పది మంది కలిసి చేతుల్లో గన్నులతో ఒక్కడిని చంపడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఒక్కడు మాత్రం తప్పించుకుంటూ అటు ఇటు పరిగెడుతూ అవకాశం దొరికినప్పుడు ఒక్కొక్కడిని లేపేస్తున్నాడు.
తన మనుషులు చనిపోవడం చూసిన ఆ గ్యాంగ్ మెయిన్ వాడికి మెంటల్ ఎక్కి, చోడ్ నా నై సాలె కొ, హమారా గావ్ ఆకే హమ్ కొ ధంకి దేతేరే అని పిచ్చిగా కాల్చడం మొదలుపెట్టాడు. ఇంకో పక్క నుంచి ముగ్గురు కూడా కాలుస్తూ బూతులు తిడుతూ రెచ్చగొడుతున్నారు. వేగంగా పరిగెడుతూ ఒకడిని షూట్ చేసి ఆ వెంటనే పెద్ద ఐరన్ పిల్లర్ వెనక దాక్కుని అన్నీ వింటూ నవ్వుకుంటు జీన్స్ జేబులో నుంచి ఇంకో మ్యాగజిన్ తీసి రిలోడ్ చేశాడు గౌతమ్.. ఇందాకటి నుంచి ఆపకుండా ఫోన్ మొగుతూనే ఉంది.. ఫోన్ తీసి టీషర్ట్ మీద అంటిన తుప్పు మరకలు తుడుస్తూ ఫోన్ ఎత్తాడు.. ఎండకి చెమట పట్టి వాడి నరాలు తేలిన చేతి కండలు నిగనిగలాడుతున్నాయి
గౌతమ్ : హలో
అంజు : రేయి అన్నయ్యా.. ఎక్కడున్నావ్ నువ్వు, ఎంతసేపటికీ ఫోన్ ఎత్తవే
గౌతమ్ : థియేటర్లో ఉన్నానే.. వినిపించట్లేదా
అంజు : ఈ యాక్షన్ సినిమాల పిచ్చి ఎప్పుడు తగ్గుద్దో ఏంటో.. గన్స్ కనిపిస్తే చాలు వెళ్ళిపోతావ్
మార్.. మారో.. అని అరుస్తూ రౌండప్ చెయ్యడానికి ముందుకు వెళుతూనే గౌతమ్ ని అక్కడి నుంచి కదలకుండా పదే పదే షూట్ చేస్తున్నారు.
అంజు : మారనంట మారు ఇప్పటికైనా
గౌతమ్ : ఫోన్ పెట్టేస్తే ఇంటికొస్తా
అంజు : ఆ.. వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురా.. నాకు ఇంట్లో తినాలని లేదు.. ఆకలేస్తుంది.
గౌతమ్ : సరే.. బై.. అని ఫోన్ పెట్టేసి వెంటనే గన్ తీసి వెనక్కి తిరిగి జాం బాక్స్ మీద కాల్చాడు అందులోనుంచి పెద్ద సౌండుతో పాటు నిప్పు రవ్వలు కూడా వచ్చాయి.. అందరూ వెనక్కి తిరిగి మళ్ళీ గౌతమ్ వంక చూసేలోపు అక్కడ నుంచి ఒక్క అంగలో పరిగెత్తి వాకీటాకీ తీసి ఏమ్ అండ్ షూట్ అని ఆర్డర్ చేస్తూనే అక్కడక్కడే తిరుగుతూ దొరికినోడిని దొరికినట్టు కాలుస్తుంటే దూరం నుంచి స్నైపర్ షాట్స్ పడుతున్నాయి.
అప్పటికే అందరూ విచ్చలవిడిగా కాల్చడంతో బుల్లెట్లు అయిపోయాయి, గౌతమ్ కి అవకాశం దొరికింది, వేట మొదలుపెట్టాడు. తన మనుషులు ఒక్కొక్కరు చనిపోతుంటే మెయిన్ వాడు భయంతో పారిపోవడానికి వెనక్కి పరిగెత్తడం మొదలుపెట్టాడు. వెంటనే వాడి కాల్లో స్నైపర్ షాట్ పడింది.. అయినా కుంటుకుంటూ వెళుతుంటే ఎదురుగా గౌతమ్ కనిపించాడు. గన్ నేరుగా వాడి తలకి గురిపెట్టాడు.
గౌతమ్ : రిజ్వాన్.. ఫోటో యా నెంబర్.. కహా రెహతా వో, కుచ్ తో బతాదొ ఉస్కె బారేమే
వెంటనే మోకాళ్ళ మీద కూర్చుని భాయ్.. భాయ్.. కోసంసే బోల్ రహాహు ముజే అంటుండగానే గౌతమ్ వాడి నుదిటి మీద ఫట్ మని దింపాడు గోలి. పడిపోయిన వాడి ప్యాంటు జేబులో ఉన్న బటన్ ఫోను, చొక్కా పై జేబులో చిన్న పాస్ పుస్తకం తీసుకుని అది చూస్తూ నడుచుకుంటూ అందరి ఫోటోలు తీస్తున్నాడు. పాస్ బుక్ బ్యాక్ పాకెట్లో పెట్టుకుంటూ చేతిలోకి వాకీటాకీ తీసుకుని.. రేయి రాజు ఇంక చాలు దిగు అని నవ్వాడు.
రాజు : దిగి చాలా సేపయ్యింది, బైటే ఉన్నా రా
గౌతమ్ చంపిన అందరినీ ఫోటోలు తీసి, ఫార్వర్డ్ చేసి రిపోర్ట్ చేస్తూ ఫోన్ మాట్లాడి బైటికి వచ్చేసరికి రాజు తన స్పోర్ట్స్ బైక్ తీసుకుని వచ్చేసాడు. గౌతమ్ బైక్ ఎక్కుతూనే అలాగే అంటూ ఫోన్ పెట్టేసాడు.
రాజు : ఏంటంటా
గౌతమ్ : తరవాత కోల్కతా
రాజు : మనం ఐపీస్ లమా లేక క్రిమినల్స్ మా
గౌతమ్ : అమ్మమ్మ.. ఎంత మాట
రాజు : మరి లేకపోతే.. నాకు ఈ యాక్షన్ వద్దురా బాబోయి అంటే వినరే.. ఏదైనా టేబుల్ వర్క్ ఇస్తే చేసుకుంటానని రెండు నెల్ల నుంచి బతిమిలాడుతున్నా కనీసం కన్సిడర్ కూడా చెయ్యట్లేదు.
గౌతమ్ : ఇంకెంతరా.. ఇప్పటికే ఏడాదిన్నర గడిచిపోయింది, ఇంకో రెండేళ్లు అంతే.. అండర్ కవర్ అయిపోద్ది.. ఆ తరువాత నీ ఇష్టం వచ్చిన దెగ్గర పోస్టింగ్ వేపించుకో
రాజు : ఆ రిజ్వాన్ గాడు ఎప్పుడు దొరుకుతాడో.. ఈ మిషన్ ఎప్పుడు అయిపోద్దో.. అంతా నా తలరాత.. దానికి తోడు నన్ను నీతో వేశారు.. ఉంటానో పోతానో కూడా గ్యారెంటీ లేదు
గౌతమ్ : కనీసం ఒక్కసారైనా ఫీల్డ్ లోకి దిగి ఈ మాట అను ఒప్పుకుంటా.. మరీ ఇంత పిరికోడివి ఏంటిరా.. ఇక పోనీ ఫ్లైట్ టైం అవుతుంది సాయంత్రం లోగా ఇంట్లో ఉండకపోతే చెల్లి చంపేస్తుంది నన్ను
రాజు : పుల్లీస్ లకి ఇన్ఫర్మ్ చెయ్యవా
గౌతమ్ : ఎవడో ఒకడు చేస్తాడులే.. రిజ్వాన్ గురించి వెతుకుతున్నాం అని ఎవరికైనా తెలిస్తే మనల్ని రాత్రి లోపు లేపేస్తారు. ఆ మాట వినగానే రాజుకి భయం వేసి వెంటనే అక్కడనుండి బండి ముందుకి పోనించాడు
ఇద్దరు సిటీ సెంటర్ కి వెళ్లి రూంలో ఫ్రెష్ అయ్యింది బట్టలు మార్చుకుని అటు నుంచి బైక్ రెంట్ కి తెచ్చిన వాడికి అప్పగించేసి ఎయిర్పోర్ట్ లో చెక్ ఇన్ అయ్యి తిరిగి హైదరాబాద్ వచ్చేసారు. రాజు తన ఇంటికి వెళ్ళిపోగా గౌతమ్ ఒక్కడే ఎవ్వరికి తెలీకుండా మైంటైన్ చేస్తున్న తన సీక్రెట్ రూంకి వెళ్లి గన్, పాస్పోర్ట్ ఎవిడెన్స్ అన్ని దాచిపెట్టి, బైటికొచ్చి బిర్యానీ తీసుకుని ఇంటికి వచ్చేసాడు.
రూంలోకి వెళ్ళగానే మంచం మీద బోళ్ళా పడుకుని కోపంగా నన్నే చూస్తున్న చెల్లిని చూసి భయపడి చిన్నగా ఏం మాట్లాడకుండా తన పక్కన కూర్చున్నాను, చిన్నగా పక్కకి జరిగి చెల్లి పక్కన పడుకున్నా.. విసురుగా అటు తిరిగింది.
గౌతమ్ : అబ్బో.. నా మీద కోపమే.. సరే.. ఎంత పెద్ద తప్పు చేసానో అర్ధం అవుతుంది, లేచి పనిషమెంట్ ఇస్తే తీసుకుంటాను, పోనీ గోడ కుర్చీ వెయ్యమంటావా
అంజన కోపంగా లేచి గౌతమ్ ని పిడి గుద్దులు గుద్దింది, ఓదార్చబోతే పక్కకి నెట్టేసి మీద ఎక్కి కోపంగా ఆటో కాలు ఇటో కాలు వేసి కూర్చుని గుండె మీద గుద్దుతుంటే చెయ్యి అడ్డం పెట్టాడు, అక్కడ గీసుకున్నది కనిపించి వెంటనే చెయ్యి పట్టుకుంది.
గౌతమ్ : చిన్నపిల్లవా ఏమైనా.. ముందు మీద నుంచి దిగు
అంజన : ఏమైందీ
గౌతమ్ : ఏంటి ?
అంజన : ఇదిగో గీసుకుపోయింది ఎర్రగా.. రక్తం కూడా గడ్డకట్టింది నీకసలు నొప్పి లేదా
గౌతమ్ : ఏది చూడనీ.. ఎప్పుడు తగిలింది ఇది అస్సలు
అంజన మొద్దు.. మొద్దోడా.. ఆ రాజు గాడితో కలిసి సోంబేరి తిరుగుళ్ళు అన్ని తిరుగుతావ్ ఆడు కనిపించనీ చెప్తా వాడి పని.. అని తిడుతూ లేచి డెటాల్, కాటన్ తెచ్చి నా చెయ్యి అందుకుని తుడుస్తుంటే దాని మొహం చూస్తున్నాను బాధ పడుతుంది, నోట్లో నోట్లోనే నన్ను నాతో పాటు రాజు గాడిని తిట్టుకుంటుంటే ఏమి తెలియని నా చెల్లి అమాయకమైన మొహాన్ని చూస్తుంటే ముద్దొచ్చింది.. నేనంటే ఎంత ప్రేమ.. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అమ్మ లేని నాకు అమ్మై పోయింది.. ఆపకుండా తననే చూస్తుంటే తల ఎత్తి నన్ను చూసింది
అంజన : ఏంటి..?
గౌతమ్ : ఏం లేదు, ఆకలేస్తుంది
అంజన : నీకోసం నేను మధ్యాహ్నం నుంచి చూస్తున్నా.. ఎంత ఆకలిసిందీ.. నా గురించి ఎప్పుడైనా ఆలోచిస్తే కదా నువ్వు
గౌతమ్ : ఇంట్లో తినొచ్చు కదా అంజు.. ఎందుకు అలా ఆకలితో ఉన్నావ్ చెప్పు
అంజన : నువ్వొస్తావ్ లే నీ చేత్తో అన్నం తిందామని చూస్తూ కూర్చున్నా, ఆఖరికి నిద్రొచ్చి పడుకున్నాను కూడా, లేచి ఆకలితో ఆత్రంగా చూసా.. ఎక్కడున్నావ్.. అస్సలు ఇంటికే రాకపోయే
వెంటనే లేచి కిచెన్ లోకి పరిగెత్తి ప్లేట్ తెచ్చి బిర్యానీ ప్యాకెట్ తెరిచాను, అంజు నీకోసం బిర్యానీ ఒక్కటే కాదు, గ్రిల్ చికెన్ కూడా తెచ్చాను నువ్వు ఈ లెగ్ పీస్ పీకుతూ ఉండు నేను తినిపిస్తా అని బిర్యానీ ముద్ద పెడుతుంటే ఆకలితో టక్కున మింగింది ముద్ద, నవ్వొచ్చి గట్టిగా నవ్వాను కానీ లోపల బాధేసింది, ఇలాంటి చెల్లెలు ఉంటే ఎవరికైనా ఇలానే అనిపిస్తుందేమో.. నేను నవ్వడం చూసి అంజు నా తొడ మీద గిచ్చింది గట్టిగా.. అబ్బా.. నొప్పే..
ఇంద పట్టు అని తింటున్న లెగ్ పీస్ నా నోట్లో కుక్కింది.. అంజుకి తినిపిస్తూనే నేనూ తిన్నాను, ప్లేట్ సింక్ లో వేసిచ్చి చెయ్యి కడుక్కుని చెల్లి మూతి కూడా తుడిచి పక్కన కూర్చున్నాను. నా మీద పడిపోయింది
అంజు : అన్నయ్యా.. ఏంటోరా ఈ మధ్య భయం భయంగా ఉంటుంది అంతా
గౌతమ్ : ఏరా ??
అంజు : నీకేమో జాబ్ లేదు, అమ్మ చూస్తేనెమో అలా ఏం పట్టనట్టు ఉంటుంది, ఇక నాన్న ఏమో ఇంటికి వచ్చి ఇప్పటికి రెండు నెలలు అవుతుంది. నాకు ఏది సరిగ్గా అనిపించట్లేదు
గౌతమ్ : జాబ్ చేస్తాను అంజు.. కొంచెం మంచి జాబ్ కోసం వెతుకుతున్నా అంతే.. ఇక నాన్న సంగతి అంటావా.. ఈ సారి రానీ ఆయన సంగతేంటో తేల్చేద్దాం
అంజు : వాళ్ల గురించి అని కాదు కానీ నీ గురించి చెప్పు.. అవును మర్చిపోయా ఇవ్వాళ కాలేజీలో పాట పాడాను, ఎంత మంది చెప్పట్లు కొట్టారో తెలుసా.. ఇంకోటేంటంటే నీ పేరు కాలేజీ మొత్తం వినిపించేలా చెప్పా.. నువ్వు నా అన్నవని
గౌతమ్ : నేనేమైనా సూపర్ హీరోనా ఆ రేంజ్ లో చెప్పడానికి.. వద్దన్న పని చెయ్యడం నీకు బాగా అలవాటు అయ్యింది అని చెవ్వు పట్టుకున్నాను
అస్సలేం జరిగిందో చెప్తా విను అని చెల్లి కాలేజీలో జరిగిన విషయాలు అన్ని చెపుతుంటే వింటూ మాట్లాడుకుంటున్నాం.. ఇంతలో పిన్ని నా రూంలోకి వచ్చింది.. ఇద్దరం తల తిప్పి చూసాం
పిన్ని చీర చాలా టైట్ గా కట్టింది, మెడలో హారంతో పాటు చిన్న చైన్, ఎర్ర చీర కట్టిందంటే ఎందుకో ఆనందంగా ఉందని అర్ధం. తల్లో మల్లెపూలు పెట్టుకుంది, రావడం రావడమే కోపంగా ఓ చూపు నా వైపు విసిరి ఆ తరువాత చెల్లిని చూసింది.
వాణి : అంజు నేను మార్కెట్ దాకా వెళ్ళొస్తా.. నువ్వెప్పుడు వచ్చావ్.. ఎంతసేపయ్యింది అని నన్ను పలకరించినట్టు ఏదో చెల్లి ముందు బిల్డప్ కొట్టింది
గౌతమ్ : ఇప్పుడే పిన్ని అని లేచి నిలబడ్డాను.. మరి నేను కూడా నటించాలిగా
వాణి : అంజు జాగ్రత్త అని వెళ్ళిపోయింది.
కూర్చుని అంజు వైపు చూసాను, నన్నే చూసి నవ్వుతుంది. మెడ చుట్టూ చెయ్యేసి దెగ్గరికి లాగాను నవ్వుకోలుగా
గౌతమ్ : ఏంటే.. హా
అంజు : నువ్వు నిజంగానే అమ్మకి భయపడతావా లేక నా దెగ్గర నటించినట్టే తన ముందు కూడా నటిస్తావా
గౌతమ్ : నాకస్సలు యాక్టింగ్ వచ్చా
అంజు : అవును.. అమాయకుడివి మరి నువ్వు
గౌతమ్ : కాదా
అంజు : అవునవును.. ఇంతకీ అమ్మని చూసావా.. తల్లో పూలు చేతి నిండా గాజులు మెడలో హారం.. నాన్న వస్తున్నాడేమో
తల మీద ఒక్కటిచ్చాను, ఎందుకే నీకవన్నీ.. చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు
అంజు : నేనేం చిన్నపిల్లని కాను
గౌతమ్ : నీ బొంద.. ఇక పో.. నేను బైటికి వెళ్ళాలి.. రేపటి నుంచి కాలేజీకి వెళుతున్నావ్ గా
అంజు : వెళ్ళాలి కదా
గౌతమ్ : వెళ్ళు.. నాక్కూడా చాలా పనులున్నాయి అని ముందు చెల్లిని నా రూం నుంచి తరిమేసాను. డోర్ పెట్టేసా.. ఇందాక చెల్లి నా రూం సర్దినట్టుంది అన్ని బైటికి తీసింది.. నా వస్తువులన్నీ లోపల పెడుతుంటే నాకు ఈ టైంలో కనిపించకూడని ఒక ఫోటో కనిపించింది. ఒక్క క్షణం గతం గుర్తుకొచ్చింది, నా ఏడుపుని కోపంగా మార్చుకుని చాలా కాలం అయ్యింది. కళ్ళు తుడుచుకున్నాను.
పక్కనే ఉన్న డంబుల్ తీసి కోపంలో టీవీకేసి కొట్టాను.. నా బాధ, ఏడుపు, కోపం ఎవడి మీద చూపించాలో తెలుసు, కానీ ఎక్కడుంటాడో తెలీదు.. వెతుకుతున్నాను.. వాడి కోసం నేను చచ్చేవరకు వెతుకుతాను, నేను వాడిని చంపేవరకు వెతుకుతాను.
రిజ్వాన్.. ఏదో ఒకరోజు నాకు కచ్చితంగా దొరుకుతావ్ ఆరోజు ఆరోజు.. డోర్ మీద ఆపకుండా కొడుతుంది చెల్లి..
అంజన : అన్నయ్యా.. అన్నయ్యా..
వెళ్లి తలుపు తీసాను కానీ లోపలికి రానివ్వలేదు.
గౌతమ్ : ఏంట్రా
అంజన : బైటికి వెళదాం.. వస్తావా.. కొన్ని టాప్స్ కుట్టించుకోవాలి.. రేపటి నుంచి కాలేజీ స్టార్ట్ అవుద్ది మళ్ళీ కుదరదు
గౌతమ్ : పదా.. అని రూం లాక్ చేసి కీస్ జేబులో వేసుకున్నాను.