ఆదివారం రాత్రి 9 గంటలు 3

 ఆదివారం రాత్రి 9 గంటలు 3 అంజన : ఈ టాప్ ఎలా ఉంది

గౌతమ్ : బాగుంది, ఆ ఎర్రది కూడా

అంజన : అమ్మ మూడు టాపులకే ఇచ్చింది డబ్బులు

గౌతమ్ : కొనుక్కోవే.. నేను పక్కనుంటే డబ్బుల గురించి ఆలోచిస్తావ్

అంజన : నువ్వు జాబ్ చెయ్యట్లేదు కదరా, నీ దెగ్గర ఉన్నాయో లేవో. ఉన్నా కూడా ఉంచుకో, నీకు సరిపోవు. జాబ్ రానీ అప్పుడు కార్డ్ నా దెగ్గరే పెట్టుకుంటా, నువ్వు ఆపమన్నా ఆపను షాపింగ్ అని నవ్వింది.

గౌతమ్ : ఉన్నాయిలే కొనుక్కో

అంజన : ఎంతున్నాయి

గౌతమ్ : నీకు సరిపడేన్ని.. నీ ఇష్టం వచ్చినవి కొనుక్కో

అంజన : అన్నేం వద్దులే ఈ ఒక్క టాప్ చాలు అని డ్రెస్ అందుకుని బిల్లింగ్ కౌంటర్ దెగ్గరికి నడిచింది. కార్డ్ తీసాను. అన్నయ్యా నీకు కార్డ్ ఉందా ?

గౌతమ్ : ఫ్రెండ్ ది

అంజన : రేయి నాకు చదవడం వచ్చు, దాని మీద నీ పేరే ఉంది.. నువ్వు కార్డ్ తిప్పేసే లోపల నేను చూసాను.. కవర్ చెయ్యకు

గౌతమ్ : ఫ్రెండ్ బ్యాంకులో పనిచేస్తాడే.. ఇప్పించాడు అని నవ్వాను దొరికిపోయినందుకు

అంజన : నవ్వుతూనే.. అలా కూడా ఇస్తారా, ఏ బ్యాంకు అది.. నేను కూడా తీసుకుంటా.. చెప్పు

గౌతమ్ : అన్నా.. నువ్వు బిల్ కొట్టు. నీకెందుకే అవన్నీ

అంజన : అలా అంటావ్ ఏంట్రా అని అలిగింది

గౌతమ్ : ఇదేనే నీతోటి వచ్చింది.. ఏదైనా అంటే అలుగుతావ్

అంజన : నేనేం ఊరికే అలగను.. నువ్వు నన్ను ఏదైనా అంటే చాలా బాధపడతాను

గౌతమ్ : సరే పదా.. ఇంకెప్పుడు విసుక్కోను.. దా.. ఐస్ క్రీం తినిపిస్తా అని బిల్ జోబులో పెట్టుకుంటూ కవర్ తీసుకున్నాను.

అంజన : ఇదిగో అమ్మ ఇచ్చిన డబ్బులు.. అని చెయ్యి ఎత్తింది.

గౌతమ్ : ఉంచుకో, నా నుంచి పాకెట్ మనీ అనుకో

అంజన : నిజంగానా అని నవ్వుతూ అడిగింది.. మళ్ళీ నిరాశగా వద్దులే ఉంచుకో

గౌతమ్ : ప్రతీ నెలా ఇస్తాలే.. కాలేజీ పిల్లవి కదా ఖర్చులుంటాయి.. పండగ చేస్కో పో

అంజన : హీ… థాంక్యూ థాంక్యూ అని ముందుకి నడిచింది

ఇద్దరం వెళ్లి క్రీం స్టోన్ లో కూర్చున్నాం, చెల్లి ఆర్డర్ ఇచ్చి వచ్చి నన్ను నవ్వుతూ చూసి ఇంకా.. అని కూర్చుంది.

గౌతమ్ : చెప్పు

అంజన : ఇన్ని డబ్బులు ఎక్కడివి నీకు ?

గౌతమ్ : అవును.. ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా కాలేజీలో

అంజన : మాట మారుస్తున్నందుకు ఒక క్షణం కోపంగా చూసి మళ్ళీ మామూలు అయిపోయి.. పల్లవి అని కొంచెం క్లోజ్ అయ్యింది.. మిగతా వాళ్లంతా హాయి అంటే హాయి, బై అంటే బై. కాకపోతే దానికి నా మీద కొంచెం కోపం ఉంది

గౌతమ్ : ఎందుకో

అంజన : ఎందుకంటే కాలేజీలో ఉన్న అబ్బాయిలంతా నా వంకే చూస్తారు. నేను దాని పక్కన ఉంటే దాన్ని ఎవరు చూడరు కదా.. మా అమ్మాయిలకి కొంచెం అసూయ ఎక్కువ.. అని కళ్ళు ఎగరేసింది.

గౌతమ్ : అబ్బో.. కాలేజీలో నిన్ను మించిన వారెవరూ లేరంటావ్

అంజన : ఏమో.. ఎవరికి తెలుసు, ఉన్నారేమో. నాకు కనిపించలేదు ఇప్పటివరకు.

గౌతమ్ : కనిపిస్తే చెప్పు

అంజన : ఆహాఁ.. చెప్తా చెప్తా అని నవ్వింది, ఇద్దరం కొంచెంసేపు నవ్వుకున్నాం

గౌతమ్ : మర్చిపోయా.. నేను కోల్కతా వెళుతున్నా.. ఇంటర్వ్యూ ఉంది

అంజన : అంత దూరం వద్దు రా.. ఇక్కడే ఎక్కడైనా చూసుకో

గౌతమ్ : అక్కడ జాబ్ వస్తే కొన్ని రోజులు చేసి మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేపించుకోవచ్చు

అంజన : మళ్ళీ ఎప్పుడు వస్తావ్

గౌతమ్ : వారం గాప్ లో మూడు ఇంటర్వ్యూలున్నాయి. ఒక నెలా రెండు నెలలు పడుతుందేమో

అంజన : హ్మ్మ్..

గౌతమ్ : ఫోన్ కొనుక్కుంటావా..?

అంజన : ఆమ్మో.. ఎక్కడివిరా నీకు అన్ని..

గౌతమ్ : చెప్పవే.. మీ అమ్మ ఎలాగో నీకు కొనివ్వదు, నాన్న సంగతి ఎలాగో తెలిసిందే.. వాళ్ళని నమ్ముకుని లాభం లేదు.. పదా అని లేచాను.. అయోమయంగా నా వెనకాలే వచ్చింది. క్రీం స్టోన్ లో బిల్ కట్టేసి బైటికి వచ్చాం.. ఆపిల్ స్టోర్ కి తీసుకెళ్లాను.

అన్నయ్యా.. చాలా కాస్ట్లీ రా అవి.. అని నేను గ్లాస్ డోర్ తీస్తుంటే నా వెనకే షర్ట్ పట్టుకుని లోపలికి వెళ్లకుండా లాగుతుంటే తన చెయ్యి పట్టుకుని లోపలికి లాక్కెళ్లాను.

గౌతమ్ : నువ్వు రా ముందు

అంజన : నాకు ఫోన్ వద్దు, ఏం వద్దు.. పదా ఇంటికి వెళ్ళిపోదాం.

గౌతమ్ : ఇవన్నీ నా డబ్బులేనే.. సరే ఇలా రా అని పక్కకి లాగాను. నాకు జాబ్ వచ్చి సంవత్సరం దాటిపోయింది, గవర్నమెంట్ జాబ్. ఏ జాబో చెప్పలేను కొన్ని రోజుల తరువాత నేనే చెప్తాను.

అంజన : నిజంగా..

గౌతమ్ : నీ మీద ఒట్టు

అంజన : నాకెందుకు చెప్పలేదు

గౌతమ్ : కాలేజీలో నా పేరు చెపొద్దన్నాను, ఆగిందా నీ నోరూ..?

అంజన : ఇది మాత్రం ఎవ్వరికి చెప్పను.. ప్రామిస్ మన ఇద్దరి మధ్యే ఉంటుంది.. ప్లీజ్ ప్లీజ్ చెప్పవా

గౌతమ్ : నా మీద ఒట్టు వెయ్యి, మీ అమ్మకి కానీ నాన్నకి కానీ ఫ్రెండ్స్ కి కానీ ఆఖరికి ఎవరైనా రెచ్చగొట్టినా మనసులో పెట్టుకోవాలే తప్ప బైటపడొద్దు

అంజన : ప్రామిస్.. ఎవ్వరికి చెప్పను

గౌతమ్ : ఐపీయస్ నేను.. అండర్ కవర్లో ఉన్నాను.. చెల్లి ఏం మాట్లాడలేదు సరికదా అది అయోమయంగా పెట్టిన మొహం చూసి నవ్వొచ్చి పర్సులో నుంచి ఐడి తీసి చూపించాను. దాన్ని పావుగంట అటుతిప్పి ఇటుతిప్పి చూసి చివరికి నమ్మి నా చేతుల్లో పెట్టింది.

అంజన : ప్రౌడ్ ఆఫ్ యురా.. కానీ ఎందుకు ఇంట్లో చెప్పలేదు నువ్వు.. ఓహ్.. ఎవ్వరికి చెప్పొద్దు అన్నావ్ కదా.. సారీ సారీ

గౌతమ్ : జాగ్రత్త ఎవ్వరికి చెప్పొద్దు.. ఎవ్వరికీ..

అంజన : డన్

గౌతమ్ : ఇప్పుడు కొనుక్కుంటావా ఫోన్

అంజన : నాకు మాక్స్ ప్రో కావాలి.. అని నన్ను నెట్టేసి ఫోన్ చూడటానికి వెళ్లిపోతుంటే నవ్వుకున్నాను. ఫోన్స్ అన్ని చూస్తూ మళ్ళీ డౌట్ వచ్చినట్టు మొహం పెట్టి నా వంక చూసింది.

గౌతమ్ : ఏంటి

అంజన : నీకు లంచాలు వస్తాయా.. తల మీద ఒక్కటి మొట్టాను

గౌతమ్ : ఎందుకే నీకవన్నీ.. రావు.. అంతా నా కష్టమే.. కొంచెం ఇన్సెంటివ్స్ వస్తాయి ఎన్కౌంటర్ చేస్తే

అంజన : వామ్మో.. అని కొంచెం గ్యాప్ ఇచ్చి.. ఎవరినైనా చంపావా అని అడిగింది

గౌతమ్ : నీకింకా ఫోన్ వాడేంత వయసు రాలేదు, పదా ఇంటికి వెళ్ళిపోదాం

అంజన : ఆ.. లేదు లేదు.. ఇంకేం అడగను.. ఈ కలర్ నచ్చింది.

గౌతమ్ : అన్నా.. ఇది సీల్ తియ్యకుండా ప్యాక్ చెయ్యండి.

అంజన : అన్నయ్యా..

గౌతమ్ : మళ్ళీ డౌటా..?

అంజన : కాదు, నాకు ఆ డ్రెస్సులు అస్సలు నచ్చలేదు

గౌతమ్ : నవ్వొచ్చింది.. షాపింగ్ చేస్తావా

అంజన : నవ్వుతూ అవునని తల పదిసార్లు ఆడించింది

గౌతమ్ : పదా.. అన్నాను..

థాంక్స్ రా అని గట్టిగా వాటేసుకుని ముద్దు పెట్టి బిల్ చేసిన వాడి చేతిలో నుంచి ఫోన్ కవర్ అందుకుంటూనే నా చెయ్యి పట్టుకుని బైటికి లాక్కెళ్ళింది. రాత్రి పదకొండు ఇంటి వరకు అటు ఇటు తిప్పి చాలానే కొంది, మధ్యలో అడిగింది అన్నయ్యా డబ్బులు ఉన్నాయా.. ఓకేనా అని.. నాకసలు ఖర్చులేం ఉన్నాయి.. దానికి కావాల్సినవన్ని కొనిచ్చాను. ఇద్దరం మాట్లాడుకుంటూ తినేసి ఇంటికి వచ్చేసాం.

అంజన : అన్నయ్య అమ్మకి ఫోన్ గురించి చెప్పకు, నేను తరవాత చెప్తాలే

గౌతమ్ : నేను అస్సలు తనతో మాట్లాడనే మాట్లాడను.. ఇంక

అంజన : సరే సరే అని నవ్వి.. గుడ్ నైట్ అండ్ థాంక్స్ రా.. థాంక్యూ వెరీ మచ్ అని వాటేసుకుంది

గౌతమ్ : థాంక్స్ చెపితే అన్నీ వెనక్కి తీసుకుంటా

అంజన : ఉమ్మ్.. అని బుంగమూతి పెట్టి.. పోరా అని రూం లోపలికి వెళ్ళిపోతూ.. అన్నయ్యా.. గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు అని అడిగింది

గౌతమ్ : నిన్నూ.. ఉండవే అక్కడే అనేసరికి తుర్రుమంది.. దాని అల్లరికి నవ్వుకుంటూ నా రూం లోపలికి వచ్చి చూడగానే గుర్తొచ్చింది.. టీవీ పలగ్గొట్టానని.. వెంటనే ముందు టీవీ ఒకటి ఆర్డర్ పెట్టి.. విరిగిన ముక్కలని అన్ని తీసి శుభ్రం చేసాను. తెల్లారి చెల్లి ఫోన్ సెట్ చేసుకుని తన నెంబర్ నాకు పంపించింది.

గౌతమ్ : మీ అమ్మ చూస్తే ఉంటది నీకు

అంజన : మా అమ్మ.. మా అమ్మ ఇంక మారరా మీరిద్దరూ

గౌతమ్ : నాతో ఎప్పుడు తను కొడుకులా ప్రవర్తించలేదు

బైట నుంచి పిన్ని అంజన కోసం వేసిన కేక వినిపించింది.

గౌతమ్ : అదిగో.. వెళ్ళు అని అక్కడితో టాపిక్ మార్చేసి చెల్లిని పంపించేసాను.

చెల్లి రోజూ కాలేజీకి వెళుతుంది, పిన్ని చెల్లి ఫోన్ చూసి మా ఇద్దరినీ కోప్పడినా మేమిద్దరం మౌనంగా ఉండటంతో ఇంకేం మాట్లాడలేదు. నేనొక వారం ఆగి రిజ్వాన్ గాడి కోసం రాజు గాడిని తీసుకుని కోల్కతా బైలుదేరాను.

+ + +
+

ఇటు అంజనకి కాలేజీలో పల్లవి బాగా క్లోజ్ అయిపోయింది, ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఎప్పుడూ ఇద్దరు ఒకే జట్టుగా తిరుగుతూ ఉండేవాళ్ళు. కాలేజీకి వచ్చాక అంజనకి బాగా ఫ్రీడమ్ దొరికినట్టయ్యింది. దానికి తోడు ఫోన్ చేతిలోకి వచ్చింది. స్నాప్ చాట్ అంటూ వాట్సాప్ గ్రూప్స్ అంటూ పీడీఫ్ లంటూ తెగ వాడేయడం మొదలుపెట్టింది అంజన. డ్యూటీలో పడి అన్నయ్య ఎక్కువగా ఇంట్లో ఉండకపోవడం, నాన్న ఎప్పుడైనా ఇంటికి వచ్చినా ఒక రెండు రోజులు ఉండి వెళ్లిపోవడంతో అంజన ఫోన్ వాడకం ఇంకా ఎక్కువైపోయింది. తన అన్నయ్య అప్పుడప్పుడు జాగ్రత్తలు చెప్తూనే ఉన్నా కొంచెం పెడచెవినపెట్టేసింది.

అదీ కాక అంజన అందానికి కాలేజీ మొత్తం ఫిదా అయిపోయింది, అప్పటివరకు అంజనని చూడటానికి తన క్లాస్ అబ్బాయిలు లేదా పక్క క్లాస్ అబ్బాయిలు మాత్రమే వచ్చేవాళ్ళు, ఏ క్షణాన ఫ్రెషర్స్ పార్టీ రోజు స్టేజి ఎక్కి పాట పాడిందో, కాలేజీ మొత్తం అంజన అందాన్ని చూసేసింది. ఆ రోజు నుంచి ప్రతీ రోజు అంజన చుట్టూ ఎవరో ఒకరు ఉంటూనే ఉండేవారు, లెక్చరర్లతో సహా.. లెక్చరర్లు వచ్చినప్పుడు సీనియర్స్ తగ్గడం, సీనియర్స్ అంజనని చూడటానికి వచ్చినప్పుడు జూనియర్స్ తగ్గి ఉండేవాళ్ళు.

అంజనకి కూడా మొదట్లో సరదాగా సిగ్గుగా అనిపించేది, ఆ తరువాత చిన్నగా విసుగు పుట్టింది, ఇప్పుడు అలవాటు పడిపోయి పట్టించుకోవడం మానేసింది. ఈ ఒక్క విషయంలోనే అంజన మీద అసూయ పడేది పల్లవి.

కాలేజీలో పల్లవికి రాకేష్ అనేవాడు బాగా నచ్చాడు, తన ప్రేమ విషయం చెప్పేలోపు రాకేషే వచ్చి అంజనతో ఫ్రెండ్షిప్ కి ఒప్పించమని బతిమిలాడేసరికి తెగ ఏడ్చింది పాపం. అంజన మీద కోపం తెచ్చుకున్నా బెస్ట్ ఫ్రెండ్ అవ్వడంతో త్వరగానే ఆ విషయం మర్చిపోయింది. అతి తక్కువ కాలంలోనే చాలామంది స్నేహితులని సంపాదించుకుంది వాళ్లతో పాటే తన ప్రమేయం లేకుండానే శత్రువులని కూడా సంపాదించుకుంది అంజన.. ఈ విషయం తనకి కూడా తెలీదు. అంజన ఎంత అందమైన పిల్లో అంత బాగా చదివే పిల్ల, అందులోనూ పాటలు, ఎక్సట్రా కర్రిక్యులర్స్ లో ముందు ఉంటుంది. అన్నిటిలో అందరి నోళ్లలో తన పేరే నానడం కాలేజీలో ఉండే కొంతమందికి విసుగుపుట్టించే విషయం, తన మీద ఈర్ష్య, కోపంతో కూడా రగిలిపోయే వాళ్ళు తన చుట్టూనే ఉన్నారని అంజన గ్రహించలేకపోయింది.

× × ×
×

కాలేజీ కాంటీన్ చివరన ముగ్గురు ఆడపిల్లలు ముచ్చట్లు పెడుతూ ఉంటే అందులో కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తుంది శిరీష, అందరూ ముద్దుగా సిరి అని పిలుస్తారు. ఊరి MLA ఒక్కగానొక్క కూతురు అవడంతో బాగా గారాబం చేసి పెంచారు, ఒళ్ళంతా పొగరే.. అందరూ తన కింద తగ్గి ఉండాలనే మనస్తత్వం కలది. తనకి తోడుగా ఇంకొ ఇద్దరు పెద్దింటి ఆకతాయి ఆడపిల్లలు. చదివేవాళ్లంటే చిరాకు వీళ్ళకి.. గత కొన్ని రోజులుగా సిరి కంట్లో పడింది అంజన. అందరూ తన గురించి మాట్లాడుకుంటుంటే తన అహం దెబ్బతింది. అంజన తన కంటే అందగత్తే అనే దాన్ని జీర్ణించుకోలేకపోతుంది.

అనిత : ఏంటే మేమంతా మాట్లాడుతూనే ఉన్నాం, నువ్వేమో ఏం పట్టనట్టు ఉన్నావ్.. ఏంటి తెగ ఆలోచిస్తున్నావ్

చైతన్య : అవునే ఏంటి మ్యాటర్ అని నవ్వింది

అప్పుడే కాంటీన్లో ఉన్న అబ్బాయిలంతా తల తిప్పి చూస్తుంటే, సిరి అటు చూడమని కోపంగా సైగ చేసింది.. మిగతా ఇద్దరు తల తిప్పి చూసారు, అంజన మరియు పల్లవి కాంటీన్ లోపలికి వచ్చారు. టేబుల్ మీద కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు అబ్బాయిలు ధైర్యం చేసి అంజనతో మాట్లాడబోగా చాలా సున్నితంగా వద్దని సైగ చేస్తూనే ఆ అబ్బాయిలని ఆపేసింది.. అది అర్ధం చేసుకున్న ఆ అబ్బాయిలు కూడా ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారు.

సిరి : ఈ మధ్య దీనికి బాగా పేరొచ్చేసరికీ బాగా బలిసింది.. కదా

అనిత : అవును.. అందరూ దాని వెనకాల పడుతుంటే కనీసం పట్టించుకోవట్లేదు, మిస్ ఇండియాలాగ ఫీల్ అవుతుంది.

సిరి : మిస్ ఇండియా కాంపిటీషన్ పెడితే ఇంటికి తెచ్చిస్తారు దానికి అవార్డు

చైతన్య : అంటే..

సిరి : కొన్ని రోజులు దానితో ఆడుకుందామా

అనిత : ఏం చేద్దాం.. ఏడిపిద్దామా

సిరి : వద్దు.. అందరూ ఇది కాలేజీ ఫస్ట్ వస్తుందని తెగ పొగిడేస్తున్నారు, అందరూ నెత్తికెక్కిచ్చుకున్నారు కదా.. దాని చదువు మీద కొడదాం దెబ్బ.. ఫస్ట్ సెంలో ఒక్క సబ్జెక్టు కూడా పాస్ అవ్వనివ్వను.. కాలేజీలో అందరి ముందు చదువురాని మొద్దుగా.. జస్ట్ అందం ఒక్కటే ఉందని పైన పటారం లోన లొటారం అనే ముద్ర వేస్తాను. ఆ తరువాత దాన్ని ఏం చెయ్యాలో చెప్తా.. ఏ అందం చూసుకుని అది అంత విర్రవీగుతుందో ఆ అందాన్ని కాలేజీ మొత్తం పంచిపెట్టేలా చేస్తా.. అప్పుడు నిజంగానే అంజన ఫేమస్ అయిపోతుంది.. ఈ నాలుగేళ్లు చదువుతున్న స్టూడెంట్స్ ఎవ్వరు అంజనని మర్చిపోకుండా చేస్తాను.

చైతన్య : ఇంట్రెస్టింగ్.. ఎలా ఇదంతా

సిరి : నాకు ఆ పల్లవి కావాలి, లైన్లో పెట్టు అని సోనీని చూసింది, దానికి సోనీ నవ్వింది.

అదే రోజు సాయంత్రానికి అనిత పల్లవికి డబ్బులు ఆశ చూపించి తమలో కలిపేసుకోవడమే కాక, అంజన తనని ఎలా బానిసలా ఉపయోగించుకుంటుందో వివరిస్తూనే తన పక్కన ఉంటే ఏ అబ్బాయి పల్లవి వంక చూడరని అదే అంజనకి కూడా కావాల్సిందని ఇంకా ఎక్కించి చెప్పింది. మెత్తని మాటలకి బుట్టలో పడ్డ పల్లవికి అంతా నిజంలా తోచి తను రాకేష్ ని ప్రేమించిన విషయం ఆ తరువాత రాకేష్ అంజనని కోరుకున్న విషయం చెప్పి బాధపడింది. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్నేహం కంటే ప్రేమే గొప్పదని అదీ ఇది చెప్పి రెండు మూడు రోజులు తమతో తిప్పుకుని పల్లవిని పూర్తిగా మార్చేశారు.

అంజన రెండు మూడు సార్లు ఏంటే ఈ మధ్య నాతో ఉండట్లేదు అని గుర్తుచేసినా పల్లవి మౌనంగా నవ్వుతూనే, ఒక పక్క అంజనతో స్నేహంగా ఉంటూనే ఇంకో పక్క అంజన విషయాలు అన్ని సిరి వాళ్ళకి చేర్చడం మొదలు పెట్టింది.