అదృష్టం తలుపు తడితే 1

అదృష్టం తలుపు తడితే 1 “ఏరా శివా ఎప్పుడొచ్చావు బెంగులురునుంచి”, “ఇప్పుడు సెలవులు కుడా లేవుగా అందరు ఆఫీసుల్లో వుంటే నేవేంటి ఇక్కడ” అన్నాడు షబ్బిర్
నేను 30 రోజులు సెలవుల్లో ఉన్నలేరా , ఇంతకీ నీ టాక్సీ ఎలా నడుస్తుంది
ఏమి టాక్సీలె మామ నిద్ర లేక చస్తున్న , బిసినేస్స్ బాగానే ఉంది కానీ ఇంకో చెయ్యి కావాలిరా ఒక్కడికే బరువు గా వుంది
“ఎవరినైనా పెట్టుకోవచ్చుగా “”
ఎక్కడ మామ ఈకాలంలో ఎవరిని నమ్మడానికి వేలు లేకుండా పోతుంది , మెన్న మా పిన్ని కొడుక్కి బండిచ్చానా , తిరిగి ఇంటికి బండి వచ్చేకొద్దీ stepni టైరు కనపడాల ఏమని అడగను వాడిని ? ఆ తరువాత తెలిసింది వాడు దాన్ని ఓ మెకానిక్ కు అమ్మేసాడని, అ తరువాత వాన్ని తిట్టి పంపించేసాలే.

ఇంతకీ నీవు లండన్ నుఉంచి ఎప్పుడు వచ్చావు , మల్లి ఎప్పుడు వెళుతున్నావు , ఉద్యోగం బెంగాలురులోనేన లేక ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయిన్చుకునేదేమైన ఉందా ??

లండన్ ప్రాజెక్ట్ అయిపోయిందిరా , ప్రస్తుతానికి బెంగాలురే సెలవుల తరువాత ట్రై చేస్తాలే ఇక్కడికి రావడానికి. ఇంతకీ రాముగాడు, రాజేష్ కలిసారా ??

ఎక్కడరా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఇదిగో ఇలా ఎప్పుడో టైం దొరికితే ఇక్కడ కలుస్తాం లేదంటే ఫోన్ లో మాట్లాడ్డమే

అది సరే కాని 30 రోజులు ఏమి చేస్తావురా , ఒక్కడివే ??

నాకు ఓ టాక్సీ ఇవ్వుమా మ , నేను తిప్పుతాను అన్నాను నవ్వుతూ

నీకు టాక్సీ తిప్పే కర్మ ఎందుకులే , నీ software ఉద్యోగం ఎదో నీవు చేసుకో , ఎలాగు సెలవలు అంటున్నావుగా నాలుగు ఊర్లు తిరిగిరా నీకు పొద్దు పోతుంది , సెలవలు గడిపినట్లు ఉంటుంది.

” సరేలే గానీ మన గ్యాంగ్ కనపడితే చెప్పు” నేను వచ్చినానని, “రేపు సాయంత్రం ఇక్కడే కలుద్దాం” మామ ఉంటాను
షబ్బిర్ , నేను చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ వరకు కలిసి ఒకే ఊర్లో చదువుకున్నాము , ఆతరువాత నేనేమో scholorship’s తో పైచదువులకి హైదరాబాదు వచ్చి అక్కడే స్తిరపడ్డాను , తరువాత కొన్నాళ్ళకు వాడు కుడా బ్రతుకు తెరువుకోసం ఇక్కడికే వచ్చాడు. అప్పటి నుండి ఈ పని ఆ పని చేసి కుడపెట్టి ఓ టాక్సీ కొనుక్కొని దాన్ని తిప్పుకొంటూ కాలం గడిపేస్తున్నాడు . నేనేమే TCS లో Systems Analyst గా చేరి , ప్రస్తుతం టీం లీడర్ గా బెంగళూర్ బ్రాంచ్ లో పని చేస్తున్నా

గత 5 ఇయర్స్ గా china , londan projects మీద వర్క్ చేసి , విసుగెత్తి ఎప్పుడూ వాడుకొని లీవ్స్ కొన్నైనా తగ్గిద్దామని 30 days లీవ్ అప్లై చేసి ఇక్కడికి వచ్చా .

పేరు చెప్పలేదుగా శివా రెడ్డి , రాయల సీమ లోని ఓ మారుమూల పల్లెలోంచి ఇక్కడికి వచ్చా , రైతు కుటుంబం నుంచి వచ్చా , నేనే ఆ ఊర్లో మొదటిసారి చదువుకొని బయటి వురికివెల్లి ఉద్యోగం చేసింది. చిన్నప్పటినుంచి ఇంటర్ వరకు ఉరికి పక్కన్నే ఉన్న జూనియర్ కాలేజీ లో చదివా , రోజు 7 k.m సైకిల్ మీద వెళ్లి వచ్చేవాళ్ళం . నాతొ పాటు మా వురునుంచి ఇంకో నలుగురు నాతో పాటు చదివే వారు , కానీ అందరు ఇంటర్ తో ఆపేశారు.
మా నాన్న లాగే నేను మంచి ఎత్తు 5.11 ఉంటా , పల్లె నుంచి వచ్చాముగా కస్టపడి పనిచేయడం అంటే ఇష్టం , దేనికి బయపడని తత్వం. అన్ని తెలుసుకోవాలనే మనస్తత్వం. అన్ని కలిపితే ఈరోజు నేను .
china లో 3 ఇయర్స్ ఉన్నప్పుడు అక్కడ ఆఫీస్ తరువాత పీకే పనులేమి లేక పక్కనే ఉన్న martial arts institute లో 3 ఇయర్స్ kungfu నేర్చుకొని ఓ నల్ల పట్టా సంపాదించా.
లాస్ట్ 2 ఇయర్స్ londanlo తెల్ల పిల్లలతో తిరిగొచ్చా.
చిన్నప్పుడే నాన్న చనిపోయాడు , అమ్మే ఉన్న భూమిని పంట పండిస్తూ నన్ను చదివించింది. జాబు వచ్చిన తరువాత ఉన్న ఆస్తి అంతా అమ్మేసి, హైదరాబాదు లో ఓ 3 బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ తీసుకోని అన్దోలో అమ్మకు తోడుగా వురునుంచి ఓ relative elderly ఆంటీ తెచ్చి ఉంచా. నేను ఎక్కడ తిరిగినా ఇబ్బంది ఉండేది కాదు.

షబ్బిర్ దగ్గర నుంచి వచ్చిన 10 నిమిషాలకి , వాని దగ్గరనుంచి ఫోన్ వచ్చింది ” మామ అర్జెంటు గా మన అడ్డాకు రాగలవా ”
“ఇప్పుడే కదరా అక్కడ నుంచి వచ్చింది అప్పుడే ఏమైంది ”
“అబ్బా , అవన్నీ తీరికగా ఇక్కడికి వచ్చాక చేపుతాగాని తోదరగా రా రా పని ఉంది “అని ఫోన్ కట్ చేసాడు.
బైక్ వేసుకొని 10 నిమిషాల లో అక్కడున్నా , అక్కడేమో వాడు టెన్షన్ గా ఉన్నాడు.

“ఏమైంది భే “, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు ?
“మామా ఓ వారం రోజులు నాకు నీ హెల్ప్ కావాలిరా ” చేస్తావా ?
“అభే అదేదో ఏడ్చు మొదట ” తరువాత చెప్తా చేసేది లేదు
“అది కాదురా , నాకేమో అర్జెంటు గా ఉరికి వెళ్ళాల్సిన పని పడింది ” కానీ ఇక్కడ ఓ మంచి గిరాకి వచ్చింది తప్పకుండా వెళ్ళాసిన సవారీ, అందుకేరా నీ హెల్ప్ కావాలన్నాను.
“ఇంతకీ నేను ఏమి చేయాలో అది చెప్పి ఎద్చు భే ”
“ఓ ఫ్యామిలీ ని వారం రోజులు వాళ్ళ village కి తెసికేల్లి రిటర్న్ తెసుకొని రావాలిరా ” ఇప్పడు నీవు తప్ప ఎవరూ అందుబాటులో లేరురా
” నీ యబ్బ , ఇందాకనే కదరా నా లాంటి software గాడికి టాక్సీ తోలడం ఎదుకన్నావు , ఇప్పుడు నీ అవసరం వచ్చిందని ప్లేట్ మర్చేసావు “. ” ఇంతకీ ఎ వూరు వెళ్ళాలి ”
” మామ నా పెళ్ళాం వాళ్లకు తెలిసిన వాళ్ళు కడప పక్కన ఓ పల్లెనుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినారు , అక్కడ ఊర్లో ఎదో ఫంక్షన్ ఉందంట , పెద్దాయన కు రావడానికి వీలు కాలేదు , నాకు ఫోన్ చేసి హెల్ప్ చేయమన్నారురా ” ఈ ఒక్క సాయం చేసి పెట్టారా
” ఇంతకీ ఎ వూరు ఎప్పుడూ వెళ్ళాలి ”
“కడప కు దగ్గర 150 దూరం చిన్న మడెం , ఓ మోస్తరు పల్లె లే ” అక్కడ పున్నానికి ఎదో తిరనాల జరుగుతూంది అంట దానికి వా ళ్ళు వెళ్ళాలంట , రేపు పొద్దున్నే బయలు దేరాలిరా

“సరే గని ఇంతకీ నీ డొక్కు టాక్సీ తెసుకొని వెల్లాల ?”

“మామ నా కారు వద్దురా , వాళ్ళకు బోల్లెరో వుంది అది తెసుకొని వెళ్ళు ”
“నీ యబ్బ ఎదో మాటవరసకు అంటే నిజంగానే డ్రైవర్ ని చేశావుగా , వేలతాలే పొద్దున్నే వచ్చి అక్కడ దింపి పరిచయం చేసి వెళ్ళు ”
నాకు ఎలాగో టైం గడవడం లేదు , వారం రోజులు village లో గడిపినట్లు ఉంటుందని వొప్పుకున్నా, అమ్మకేమో ఫ్రెండ్ పెళ్ళికి వెళుతున్న అని చెప్పి చిన్న back ప్యాక్ లో బట్టలతో పాటు కావాల్సిన సామాగ్రి సర్దుకున్నా .
పొద్దున్నే షబ్బిర్ గాడు బైక్ మీద నన్ను పికప్ చేసుకున్నాడు .
” రేయ్ , వాళ్ళకు నేను software అని ఎం చెప్పకు , ఓ డ్రైవర్ గానే పరిచయం చేయి చాలు ”
“సరే మామ , అది మనలాగే పల్లెటూరు , కాని వెళ్ళు పెద్ద బుసాములులే అక్కడ , వారం రోజులు ఎట్లో అద్జుస్త్ చేసుకో , జాగ్రత్తగా తెసికిల్లి , తిరిగి తీసుకోని రా , అక్కడ గొడవలు ఏమి పెట్టుకోకు ”
“సరేలేరా ”
ఇద్దరం బంజారాహిల్స్ లో ఓ పోష బుంగ్లా ముందు దిగాము , పార్కింగ్లో ఓ బోల్లోరో , ఓ mercedese ఉన్నాయి .
” బాగా బలసిన వాళ్ళ మామ ?”
“అవునురా , ఈ పెద్దాయన ఒకప్పుడు అక్కడ MLA గా చేసాడంట “, ” ఈయన కొడుకు ఇక్కడ పెద్ద పోస్ట్ లో ఉన్నాడు ”
” ఇంతకీ ఎవరూ ఎవరూ వస్తున్నారు ?”
“మాజీ MLA లాస్ట్ వీక్ వెళ్ళిపోయాడు , ఇప్పడు ఎవరు ఎవరూ వస్తున్నారో నాకు తెలిదు , ఉండు మనము వచ్చినట్లు చెప్పి వస్తా ”
ఓ రెండు నిముషాలు తరువాత ఓ పెద్దావిడ బయటకు షబ్బిర్ తో పాటు వచ్చింది.
” ఎరా అబ్బి , నీకు ఈ పెద్ద బండి తోలడం వచ్చా ?”
“వచ్చామ్మగారు ”
“ఇంతకుముందు, ఎక్కడ తోలేవడివి ”
“బెంగుళూరులో తోలేవాడమ్మ , ఇప్పుడు ఇక్కడే తోలుతున్నాడు ” , మా వూరి వాడేనమ్మ , నాకు బాగా తెలుసు అన్నాడు షబ్బిర్
“సరే గాని అబ్బి, ఏమైనా తిన్నావా , తినకుంటే వచ్చి తిని లగేజి లోపల పెట్టు , ఒరే షబ్బిర్ నీవుకుడా వచ్చి తినిపో”
“పిల్లలు రెడీ అవుతున్నారు , వాళ్ళు తాయారు కాంగానే పోదాము ” అంటూ లోపలకు వెళ్ళింది
షబ్బిర్ ఆమెతో పాటు లోపాలకి వెళ్లి , రెండు పెద్ద ప్లేట్స్ లో ఉప్మా పట్టుకొచ్చాడు , ” లా గించారా, వాళ్ళు వచ్చేలోపు ” అని నా ముందు ఓ ప్లేట్ పెట్టాడు.

ప్లేట్ లో క్వాంటిటీ చుస్తే రెండు రోజులకు సరిపోయేటట్లు ఉంది “ఏంట్రా , లంచ్ అ తరువాత డిన్నర్ ఉండవా ఏంటి ? ”

“తిను భే నీ వెంట అంతా అడ లేడీస్ , నీచేతికి అయ్యగారు డబ్బులు ఇస్తారు వాడుకున్నదానికి లెక్క చెప్పి మిగినల డబ్బులు తిరిగి ఇచ్చేస్తువుగని ” అన్నాడు
మేము తింటుంటే ఓ 55 వయసున్న భారి పర్సనాలిటీ వకిట్లోచి వచ్చి , “ఇదిగో షబ్బిర్ అ డ్రైవర్ పేరేంటి ? ” అన్నాడు,
“తింటున్న వాడు , లేచి శివ అంటారు అయ్యా ” అన్నాడు

“ఇదిగో అబ్బి , ఈ 10,000 నీ దగ్గర ఉంచుకో , వాళ్ళకు ఏమి అవసరం అయినా నీవే తెచ్చివ్వు, ఇంకా డబ్బులు కవ్వాలంటే మా అమ్మను అడుగు ”

“బండి జాగ్రత్తగా తోలుకేల్లు , పెద్డోలు ఉంటారు బండ్లో ” అన్నాడు.
అక్కడనున్చోనే గట్టిగా ” శాంతా , రెడీ నా ఇంక రండి బయటకు లేట్ అవుతుంది ” అన్నాడు.
నేను షబ్బిర్ గబా గబా మింగేసి ప్లేట్ ఓ మూల పడేసి చేతులు కడుక్కొని , లగేజి కోసం లోపలి వెళ్ళాము
కొంప పెద్దదే , వాకిలి పక్కనే 4 పెద్ద సుట్కేసులున్నాయి, ” ఎరా, నీ వేమో వారం అన్నావు లగేజి చుస్తే ఓ నెలకు సరిపడా ఉడేట్లుంది ” అని వాని చెవిలో గోనిగాను.
“ష్ , గట్టిగా మాట్లాడకురా , ఈయన కూతురు , ఆ అమ్మాయి ఫ్రెండ్ వస్తున్నారంట, అందుకేనేమో అంత లుగేజి ”
“తిర్నానలకు వేలుతున్నర లేక మిస్ ఇండియా పోటిలకు వెలుతున్నారా ” మనకెందుకులే , పద డిక్కీలో పెడదాము అని తెసికేల్లి కార్ లో పెట్టి నేను బండి చూసుకుంటా నివు లోపలకు వెళ్ళు ఏమైనా పెట్టాలేమో ఇంకా అన్నాను.

షబ్బిర్ లోపలికేల్లంగనే , బండి చుట్టూ ఓ రౌండ్ వేసి అన్ని చెక్ చేశా , బోయ్నేట్ ఒపెన్ చేసి ఆయిల్ ఉందొ లేదో చూసా , బండి రీసెంట్ గా సర్వీస్ చేసినట్టు ఉంది. అంతా బాగుంది ఇంకా బయలుదేరడమే తరువారు అనుకుంటుంటే .

“రేయ్ , ఓసారి ఇట్లారా” అని షబ్బిర్ పక్కకు తెసికేల్లడు
“చూడు నువ్వు వేల్లిది డ్రైవర్ గా , రొంత ని ఇంగ్లిస్ తగ్గిచ్చుకో నీ కోపంతో పాటు , ఈ శాంత మ్మకు ముక్కు మీద కోపమంటా , నివు ఏమి పట్టిచ్చు కోకు , నాకోసంరా ”
“నా బీజాను మల్లి మల్లి చెప్పింది భయ్యా అంత పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు అంత డబ్బులు సంపాదిస్తున్నాడు , డ్రైవర్ గా పోవడం ఏంటి ” అంది నేను దానికి సర్ది చెప్పా ” వాడు నా దోస్తు ని వేమి ఫికర్ చేయకు అంత బాగానే జరుగుతూంది అని చెప్పి వచ్చాను ” అన్నాడు

” సరేలే భే , అన్ని వోప్పుకోన్నాక తప్పుతుందా ” చలో బేఫికర్ అని చెప్పి , బండి దగ్గరకు వచ్చా .
ఇంట్లోచి ఇద్దరు elderly లేడీస్ అరౌండ్ 65, 70 ఓ 12 పాపా , పెద్దారెడ్డి కూతురు ,అయన కూతురి ఫ్రెండ్. ఇద్దరు అదేదో కాలేజీ లో ఇంజనీరింగ్ చదువుతున్నారంట
పెద్దలు , పాప , శాంతా గారి ఫ్రెండ్ వెనుక సీట్ లో కుచొంటే శాంతా ఫ్రంట్ సీట్ లో కుచోంది .
డోర్స్ క్లోజ్ చేసి ఇక వెళ్ళామా సార్ అన్నాను.