మోసం 1 ఊరికి కొత్తగా వచ్చిన సాధన ఉషా టీవీ ఛానెల్లో యాంకర్ గా పనిచేస్తుంది, వచ్చిన ఈ వారం రోజుల్లో ఊరి గురించి తెలుసుకుని తన ఉద్యోగం మొదలుపెట్టింది.. అదే మైకు తీసుకుని ఊరి మీద పడటం. పని కొత్త అవడంతో ఎవరితో ఎలా నడుచుకోవాలో తెలియకపోయేసరికి ఛానెల్ హెడ్ కూడా తనకి సరిగ్గా సహకరించలేదు, పర్యావసానంగా చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తున్న కెమెరామెన్ చోటుని తనకి అప్పజెప్పారు, వాడికి పని రాదు. తల కొట్టుకుంటుంది సాధన.
సాధన : ఒరేయి చోటు రెడీనా
చోటు : రెడీ అక్కా
సాధన : ముందు కెమెరా ఆన్ చేసావా, నా పరువు తీయకురా.. నీకు దణ్ణం పెడతా అని చేతులెత్తి మొక్కింది.
చోటు : చేసాను.. రెడీ 1..2..3.. గొ.. టేక్.. రోలింగ్.. యాక్షన్
సాధన : ఎందుకురా కుక్కలాగ అరుస్తావ్
చోటు : రోలింగ్.. రోలింగ్
సాధన కెమెరా వంక చూసి నవ్వుతూ హాయ్ హలో అందరికీ.. నేను మీ సాధన. సాయంత్రం ఐదు అవుతుంది ఇక మన ప్రోగ్రాం మొదలెడదాం. గోవిందపురం.. పల్లెటూరు పేరులా ఉందా.. కాదు సిటీనే, ఒకప్పుడు పల్లెటూరే కానీ ఇప్పుడు మహానగరం. ఊరు చూడటం కంటే ముందు ఊరి చెరువు చూడండి అన్నారు ఇక్కడ ప్రజలు అందుకే ముందు చెరువు దెగ్గరికి వెళదాం రండి అని సాధన నవ్వుతూ కురులని చెవి వెనక్కి నెట్టి నడుస్తుంటే కెమెరామెన్ చోటు వెనక నడుస్తూ వాడి పనితనం చూపిస్తున్నాడు. ఒకటి రెండుసార్లు సాధన బ్యాక్ చూపించి ఆ వెంటనే చుట్టు పక్కన అమ్మాయిలు, కాలవలో పారే మురికి నీరు, బర్రెలు వేస్తున్న పేడ, కింద గడ్డి అన్ని కవర్ చేస్తూ చెరువు దెగ్గరికి వెళ్లారు. కెమెరా రోలింగ్
సాధన : సాయంత్రం అయితే అందరూ సరదా కోసం వచ్చేది ఈ చెరువు దెగ్గరికే.. కొంతమందిసరదా తీర్చుకోవడానికి వస్తే ఇంకొంతమంది సరదా తీరుస్తుందట ఈ చెరువు. ఇక్కడ చాలా కధలు మొదలయ్యాయి అలానే అంతమూ అయ్యాయి అంటున్నారు ఇక్కడివాళ్ళు. అవును ఈ పాటికే నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్ధమయ్యే ఉంటుంది, ఇవ్వాల్టి టాపిక్ ప్రేమ.. చాలా ప్రేమ కధలు మొదలయ్యేది ఇలాంటి వాతావరణం నుంచే.. ప్రేమాలయం విత్ సాధన.. రండి అని వెళుతూ కూర్చుని చల్ల గాలిని ఆస్వాదిస్తున్న ఒక జంట దెగ్గరికి వెళ్లి మాటలు కలిపింది. అందరినీ పలకరిస్తుంటే ఒక్కొక్కరు ప్రేమ నిర్వచనం చెపుతూ చివరికి అది ప్రేమ గొప్పదా పెళ్లి గొప్పదా అనే చర్చకి దారి తీసింది.
అందరూ టీవీలో కనిపిస్తామేమోనని తెగ ఆరాటపడుతు కెమెరా ముందుకి వస్తుంటే నలుగురు మాత్రం దూరంగా కూర్చుని నవ్వుకుంటున్నారు. కబుర్లతో వేరే ప్రపంచంలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ మీద పడింది సాధన దృష్టి.. అటు వైపు వెళ్లి వాళ్ళ దెగ్గర నిల్చుంది. నలుగురు ఒకేసారి ఆమెని చూసేసరికి వింతగా వాళ్ళ వైపు చూసింది. చెప్పండి అన్నాడు ఒకడు వెటకారంగా
సాధన : అదే ప్రేమ గొప్పదా పెళ్లి గొప్పదా అని.. మీ అభిప్రాయం చెప్పండి అని సరదాగా అడిగింది ఒకే వయసు వారు అవడంతో
తెలుసుకుని ఏం చేస్తారు అన్నాడు ఒకడు, ఇదేదో తేడాగా ఉందని సాధన చోటుని చూడగానే వెంటనే కెమెరా పాజ్ లో పెట్టాడు.
సాధన : జస్ట్ టీవీ ప్రోగ్రాం అండి.. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడండి లేదంటే లేదు
సరే అడగండి అనేసరికి చోటు మళ్ళీ ప్లే బటన్ మీద నొక్కాడు.
సాధన : చెప్పండి.. మీ దృష్టిలో ప్రేమ గొప్పదా లేక పెళ్లి గొప్పదంటారా
నన్నడిగితే అక్రమ సంబంధం గొప్పదంటాను, సూటిగా సమాధానం ఇచ్చాడు. గొల్లుమని నవ్వారు మిగతా ముగ్గురు వారితో పాటు పక్కనే ఉన్న టీ కొట్టు మల్లేష్. సాధన మరియు చోటు షాక్లో నుంచి తెరుకోవడానికి పెద్ద టైమే పట్టింది. అబ్బాయి చూడటానికి అందంగా ఉన్నా చాలా తేడాగా ఉన్నాడు అనుకుంది. నలుగురు లేచి టీ కొట్టు మల్లేష్ కి డబ్బులు ఇచ్చి తిరిగారు.
సాధన : మీ పేరు
రామానుజం అన్నాడు నవ్వుతూ.. ఆటపట్టిస్తున్నారని అర్ధమైంది సాధనకి.
సాధన : మీరు లవ్ లో ఉన్నారా
లేదు నేనొక లవ్ ఫెయిల్యూర్ ని, ఆమె కోసమే వెళుతున్నాను. నా ప్రేమ కధకు నేనే కదా విలను, నా రాత నాది తప్పు ఎవరిదననూ అని పాడుతూ వెళుతుంటే మీ లవర్ పేరు అని అడిగింది వాళ్ళు ఎలాగో తిక్క సమాధానమే చెపుతారని తెలిసినా
నందిని అంటూ వెళ్ళిపోయాడు నవ్వుకుంటూ, సాధనకి కూడా నవ్వొచ్చింది. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా అని మైక్ మిగతా ముగ్గురి మొహాల మీద పెట్టింది. వెంటనే మిగతా ముగ్గురిలో నా పేరు సంజయ్ రామస్వామి బిజినెస్ మాన్ అన్నాడు ఒకడు, వెంటనే రాజ్ బీహారి.. బీహార్ కా షేర్. తాయత్తులు కడతాను అన్నాడు కెమెరాని ఎప్పుడు చూడనట్టు వెర్రి నవ్వు నవ్వుతూ, నా పేరు కాట్ రాజ్ అండి ద బుస్ అని సమాధానాలు ఇచ్చి ఎవరి క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళు సీరియస్ గా నటిస్తూ వెళ్లిపోయారు. పిచ్చి లేచింది సాధనకి. కెమెరా ఆపి పక్కనే ఉన్న బడ్డీ కొట్టు దెగ్గరికి వెళ్లి రెండు టీ చెప్పారు.
ఆడుకున్నారా మీతో అన్నాడు మల్లేష్ నవ్వుతూ
సాధన : ఎవరండీ వాళ్ళు అలా ఉన్నారు
నా పేరు మల్లేష్ మేడం.. గత ఇరవై ఐదు సంవత్సరాలనుండి ఇక్కడే టీ అమ్ముతున్నాను. వెళుతున్న ఆ నలుగురు చిన్నప్పటి నుంచి దోస్తులు. ముందు రామానుజం అన్నాడే అతనే వీళ్ళకి లీడర్.. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశాడు, ఇక ఆ సంజయ్ రామస్వామి పేరు జాఫర్, మెకానిక్ షాప్ నడుపుతున్నాడు దానితో పాటే ల్యాండ్ బ్రోకర్ పనులు చేస్తాడు. ఆ రాజ్ బిహారి గాడు భగత్, బాగా రిచ్.. నాలుగు అపార్ట్మెంట్లు ఉన్నాయి రెంట్లు, డబ్బులు వడ్డీలకి తిప్పుతుంటాడు. చివరన కాట్ రాజ్ సుధీర్ తన పేరు అనాధ.. ఈ ముగ్గురే వాడి కుటుంబం. నేను చూసిన వాళ్లలో చాలా కాలం నుంచి ఫ్రెండ్స్ గా ఉన్నది వీళ్ళే
సాధన : ఆ రామానుజం పేరేంటి అంది వెళ్తున్న వాడిని చూస్తూ
మల్లేష్ : విక్కీ.. వాడి వల్లే మిగతా ముగ్గురు మంచి పోసిషన్లో ఉన్నారు, వాడేది చెపితే అదే వింటారు వాళ్ళు.. వీడు మాత్రం ఇంజనీరింగ్ చేసి నాలుగేళ్ల నుంచి కాళిగా ఉంటున్నాడు.
సాధన : ఎందుకలాగా
మల్లేష్ : తెలివికల్లోడు, తింగరోడు ఎవరి మాట వినరు కదమ్మా
ఇంతలో టైం అయిపోయేసరికి మళ్ళీ కలుద్దాం అంటూ చిల్లర ఇచ్చేసి నవ్వి అక్కడినుంచి వెళ్ళిపోయింది సాధన.
విక్కీ : జాఫర్.. ఒక పెప్సీ అనగానే వెళ్లి పెప్సీ కొనుక్కోచ్చాడు,తాగుతూ చిన్నగా నడుస్తున్నాడు. వెనకాల నడుస్తున్న ముగ్గురు స్నేహితులు నువ్వు అడుగు అంటే నువ్వు అడుగు అని గుసగుసలు పెట్టుకోవడం విని వెనక్కి తిరిగి ఎవడో ఒకడు అడగండ్రా.. ఏంటి
భగత్ : అదే.. నీ లవ్వు
విక్కీ : కరిగిపోయింది ఆ కొవ్వు
సుధీర్ : అన్నతో మాట్లాడదాం
విక్కీ : ఒద్దు.. అయినా ఏమని మాట్లాడతాం
జాఫర్ : మరి మీ మావయ్య.. కూతురు అంత మోసం చేస్తుంటే..
విక్కీ : పాపం ఆయనకీ తెలిసాక కళ్ళు తిరిగి పడిపోయాడు
భగత్ : అయితే దాన్ని ఏమి చెయ్యవా.. నీతో తిరిగి ఇప్పుడు నీ అన్నని చేసుకుని తిరిగి నీ ఇంటికే కాపురానికి వస్తుంది, అది మాములు ఆడది కాదు.
విక్కీ : మర్యాద.. అదిప్పుడు నాకు వదిన, మీకు వదినే. అన్నయ్య పాపం చాలా ప్రాణంగా ప్రేమించాడు రా దాన్ని
భగత్ : అయినా కానీ
విక్కీ : వాడికి ఆల్రెడీ జీవితంలో ఒక దెబ్బ పడింది, దానికే కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. మళ్ళీ అంటే తట్టుకోలేడురా
సుధీర్ : అది నీతో పడుకుందిరా
విక్కీ : అది నన్ను వాడిని ఇద్దరినీ మోసం చేసిందిరా.. నాకు ఆలోచిస్తుంటే మైండ్ పని చెయ్యట్లేదు.. ఇంతలో ఫోన్ మోగింది. చూస్తే అన్నయ్య
విశాల్ : రేయి దున్నా ఎక్కడ తిరుగుతున్నావ్.. ఇక్కడ పనులు.. రేపే పెళ్లి
విక్కీ : చిల్ బ్రో.. వస్తున్నా అని ఫోన్ పెట్టేసి స్నేహితుల వంక చూసాడు. అందరూ మౌనంగా పెళ్ళిలో పనులు చెయ్యడానికి ఇంటికి వెళ్లిపోయారు.
హలో ఆ బాబాయి, నేను శ్రీనివాస్ చిన్న కూతురు స్వప్నికని. నాన్న ఫోన్ కలవట్లేదు ఒకసారి ఫోన్ చెయ్యమని చెప్పు అని పెట్టేసింది అమెరికాలో చదువుతున్న స్వప్నిక. కాసేపటికి శ్రీనివాస్ ఫోన్ చేశాడు.
శ్రీనివాస్ : హలో సప్పీ
స్వప్నిక : ఎన్ని సార్లు చెప్పాను నన్ను అలా పిలవొద్దని, అయినా అక్క పెళ్లి అప్పుడు వీడియో కాల్ చేస్తానన్నావ్, రాలేకపోయినా కనీసం చూద్దును కదా అనుకున్నాను కానీ నువ్వసలు నాకు ఫోనే చెయ్యలేదు, పదిహేను రోజులు అవుతుంది నాతో మాట్లాడి, పెద్ద కూతురి పెళ్లి పనుల్లో పడి మర్చిపోయావా నన్ను పూర్తిగా
శ్రీనివాస్ : ఒక్క నిమిషం లైన్లో ఉండరా, అక్కా బావా ఇంట్లోకి అడుగు పెడుతున్నారు నీతో మాట్లాడాలి అని ఫోన్ కిందకి దించి, హారతి ఇవ్వమని తన భార్యని పిలిచాడు.
విశాల్ : మావయ్యా.. హారతి విక్కీ ఇస్తాడు
శ్రీనివాస్ : వాడా.. వాడు
విశాల్ : ఈ ఇంటికి నాకు వాడు తప్ప ఎవ్వరు లేరు మావయ్య, నా సంతోషం అంతా వాడిదే, వాడి చేతుల మీదగా.. వాడు ఆహ్వానించగా మేము లోపలికి అడుగుపెడతాము అని పెళ్లి కూతురి భుజం మీద చెయ్యి వేసి ప్రేమగా తన తమ్ముడిని చూసేసరికి విక్కీ నవ్వుతూ హారతి తిప్పి లోపలికి రమ్మన్నాడు.