ఆదివారం రాత్రి 9 గంటలు 5

ఆదివారం రాత్రి 9 గంటలు 5 అన్నయ్యకి ఫోన్ చేసి పావుగంట అయ్యింది. కోల్కతా నుంచి రావడానికే ఒక రోజు పడుతుందేమో అప్పటవరకు నేను ఇక్కడే, అమ్మ ఎలా ఉందొ, ఇదంతా తెలిస్తే ఏం జరుగుతుంది. రేపు అన్నయ్య వచ్చినా అంతా తెలిసిపోతుంది వాడు నన్ను చూసే చూపు నేను భరించగలనా.. ఎంత పనిచేసాను పిచ్చిదాన్ని పిచ్చిదాన్ని అని లెంపలు వాయించుకున్నాను.

ఇదంతా చూస్తున్న పల్లవి కనీసం అంజన దెగ్గరికి కూడా వెళ్లలేకపోయింది. ఈ పాటికే తన ఇంట్లో వాళ్ళు వెతుకుతూ ఉంటారు, వీళ్లేమో పేరెంట్స్ లేనిదే పంపించం అని చెపుతున్నారు ఏమవుతుందోనని వణికిపోతుంది పల్లవి. అనుకున్నట్టుగానే పల్లవి తల్లి తండ్రులు స్టేషన్ లోపలికి వచ్చి ఆ పెద్ద సార్ కాళ్ళ మీద పడి ఏడ్చారు, అయినా ఆయన ఒప్పుకోలేదు. ఎంతసేపు బతిమిలాడినా బూతులు తిట్టి పక్కన నిల్చోబెట్టాడే తప్ప వాళ్ళ మాటలు అస్సలు వినిపించుకోలేదు. నా గురించి సిరి వాళ్ళ గురించి పల్లవి గురించి చాలా నీచంగా మాట్లాడాడు.. పల్లవిని అన్న మాటలకి పాపం పల్లవి వాళ్ళ నాన్న అవమానంగా తల దించుకుని ఏడ్చేసాడు.

ఇంతలో స్టేషన్ లోపలికి అన్నయ్య రావడం చూసాను, లేచి నిలుచున్నా, కనీసం నా వంక చూడనైనా చూడలేదు. ఐదు నిమిషాలు వేడి వేడిగా మాట్లాడుకున్న తరువాత ఆయన తగ్గాడు, ఆ తరువాత ఎవరో న్యూసెన్స్ కంప్లైంట్ మీద జనరల్ గా ఏరియాలో తిరుగుతుంటే స్పీకర్స్ నుంచి పెద్ద పెద్ద సౌండ్స్ విని లోపలికి వచ్చి మమ్మల్ని చూసి మత్తులో ఉన్న అందరికీ బట్టలు తొడిగి తీసుకొచ్చారని చెప్పాడు. అక్కడున్న సీసి కెమెరాలో చూసింది మొత్తం చెప్పాడు. మధ్యలో మా మీద సానుభూతి చూపించిన ఆ అక్క కూడా అంతా కలిసి నన్ను ట్రాప్ చేశారని పల్లవి తనతో చెప్పిన మాటలు అన్నయ్యకి పూస గుచ్చినట్టు చెప్పింది. ఆ తరువాత కొంచెంసేపు ఏదేదో మాట్లాడుకుని అందరూ టీ తాగి, చాలా సేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. చివరిగా లేచి వెనక్కి తిరిగి నా వంక చూసాడు, వాడి కళ్ళలోకి చూసే అర్హత నాకు లేదు, తల దించుకున్నాను. లేడీ అక్క లాక్ ఓపెన్ చేసింది నేను బైటికి నడుస్తుంటే పల్లవి నన్నే నిస్సహాయంగా చూడటం గమనించాను. తన చెయ్యి పట్టుకుని బైటికి నడిచాను.

పెద్ద సార్ : గౌతమ్ సర్.. ఆ అమ్మాయే మీ చెల్లిని ట్రాప్ చేసి ఇరికించింది, దాన్ని వదిలెయ్యండి నేను చూసుకుంటాను అన్నాడు

వెంటనే కిందకి వంగి అన్నయ్య కాళ్లు పట్టుకున్నాను, అంతకుమించి ఇంకేం చెయ్యాలో నాకు తెలీలేదు. చెయ్యి పట్టుకుని నన్ను లేపాడు. నేను తల ఎత్తలేదు అలాగని పల్లవి చెయ్యి వదలను లేదు. అన్నయ్య రెండు నిమిషాలు నన్నే చూసాడు, పల్లవి చెయ్యి ఇంకా గట్టిగా పట్టుకున్నాను.

గౌతమ్ : తను కూడా నా చెల్లెలే, వదిలేయి అన్నా.. అందరూ వెళ్లిపోయారు ఈ ఒక్క అమ్మాయి ఎందుకు, ఏదో డబ్బుకి ఆశ పడింది. ఇదే వీళ్ళకి గొప్ప గుణపాఠం అవుతుంది.

పెద్ద సార్ : మీరు చెప్పాక తప్పుతుందా.. మా పై ఆఫీసర్ చెప్పింది చేసి తీరాలి కదా అని కోపంగానే అన్నాడు.

అన్నయ్య అక్కడ నుంచి నన్ను బైటికి లాక్కొచ్చాడు, నా వెంటే పల్లవి తన వెనుకే పల్లవి తల్లి తండ్రులు కూడా వచ్చారు. స్టేషన్ నుంచి బైటికి రాగానే పల్లవి చెయ్యి వదిలేసాను. పల్లవి తల్లితండ్రులు అన్నయ్యకి చేతులెత్తి దణ్ణం పెట్టారు. అన్నయ్య కనీసం వాళ్ళ వంక కూడా చూడలేదు. వెళ్లి బైక్ ఎక్కి స్టార్ట్ చేసి రేస్ చేశాడు, మౌనంగా వెళ్లి వెనక కూర్చున్నాను. అన్నయ్య కోపం అర్ధమవుతుంది వాడిని కౌగిలించుకుని గట్టిగా ఏడవాలని ఉంది కానీ ఆ పని చెయ్యలేకపోయాను.. బండి ఇంటి దెగ్గర ఆగింది. లోపలికి వెళ్ళిపోయాడు, తన వెనుకే నడిచి వెళ్లాను. సోఫాలో కూర్చుని తల పట్టుకున్నాడు, నాకేం చెయ్యాలో తెలీలేదు అలానే గోడకి ఆనుకుని నిలబడ్డాను.

పది నిమిషాల మౌనానికి వాణి హాల్లోకి వచ్చి ఏడుస్తున్న కూతురిని చూసింది.

వాణి : ఎక్కడికెళ్లావ్ నువ్వు చెప్పా పెట్టకుండా

గౌతమ్ : స్టేషన్ నుంచి వస్తుంది

వాణి : ఏ స్టేషన్.. కొడుకు వంక కోపంగా చూసింది

గౌతమ్ : పుల్లేస్ స్టేషన్

వాణి : అంజు..??

గౌతమ్ : నీ సుఖం నువ్వు చేసుకున్నావ్, దాని సుఖం అది చూసుకుంది. డ్రగ్స్ కి అలవాటు పడింది, అర్ధరాత్రి నగ్నంగా ఇద్దరు మగాళ్లతో పుల్లేసులకి దొరికితే ఈడ్చుకెళ్లి బొక్కలో తోశారు.

వాణి కోపంగా తన కూతురిని చూసింది, అంజన ఏడుస్తుంది తప్పితే ఒక్క మాట కూడా మాట్లాడలేదు, దెగ్గరికి వెళ్లి కూతురి గడ్డం పట్టుకుని పైకి ఎత్తింది. అంజన ఎక్కిళ్ళు పెడుతూ ఏడ్చేసేసరికి వాణి చెయ్యి ఎత్తి కొట్టబోతే

గౌతమ్ : మరి నువ్వు చేసిందానికి ఏ శిక్ష వేసుకోవాలో అలోచించి దాని మీద చెయ్యి వేయి.. నీ వయసులో సగం కూడా లేని వాడితో పడక సుఖం పొందుతున్నావ్ నీ మత్తులో దాన్ని పట్టించుకోకపోవడం వల్లే నా చెల్లెలు దారి తప్పి ఈ స్థితికి వచ్చింది.

అంజన అది విని ఆశ్చర్యంగా తన అమ్మని చూసింది, దానికి వాణి తల దించి వెంటనే కొడుకు వంక గుడ్లు ఉరిమి చూసింది.

గౌతమ్ : ఒకసారి దాన్ని చూడు ఎలా ఉండేది, అల్లరిగా అందరినీ దబాయిస్తూ నాకు అమ్మలా ఉండే నా చెల్లి ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది.. అని కళ్ళు తుడుచుకున్నాడు.

అంజన ఏడుస్తూనే పరిగెత్తుకుంటూ వెళ్లి తన అన్నయ్యని వాటేసుకుని ఏడ్చేసింది.

అంజు : అన్నయ్యా.. సారీ.. సారీ.. నీ చెల్లిగా ఉండే అర్హత నేను కోల్పోయాను.. నాకు చచ్చిపోవాలని ఉంది.. సారీ.. సారీ.. సారీ అన్నయ్యా.. అని కాళ్ళ మీద పడిపోయింది. గౌతమ్ తన చెల్లిని పైకి లేపి కళ్ళు తుడిచి నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు.

గౌతమ్ : నీ తప్పు లేదని నాకు తెలుసురా.. నా చిట్టి తల్లి తప్పు చేసిందని నన్ను కన్న అమ్మ చెప్పినా నేను నమ్మను. అంజన ఇంకా ఎక్కువగా ఏడ్చేసింది. ముందు తిందువు పదా అని భుజం మీద చెయ్యేసి తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి అన్నం తినిపిస్తుంటే ఇంకా ఎక్కువగా ఏడ్చేస్తూ అన్నం మింగుడు పడకపోయినా తింటుంది.

గౌతమ్ : అదిగో.. నువ్వలా ఏడిస్తే నేను కూడా ఏడుస్తా మరి.. నేను ఎంత దరిద్రంగా ఏడుస్తానో నీకు తెలుసు..

అంజనకి పొరబోయింది, నవ్వొచ్చినా ఆ వెంటే ఏడుపు కూడా వచ్చింది. వెంటనే అన్నం తినిపిస్తున్న చెయ్యి పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ లవ్ యు అన్నయ్యా.. అంది

అన్నం తినిపించి మూతి తుడిచాడు, ఇంకా కన్నీరు కారుతూనే ఉంది.. వెళ్ళు.. వెళ్లి ఫ్రెష్ అయ్యి ముందు రెస్ట్ తీసుకో కళ్ళు మూసుకుని పడుకో.. ఆ తరువాత నీ వల్ల జరిగిన తప్పులని ఎలా సరిచేయ్యాలో ఆలోచించు. అలానే ఈ అంజనలో నా అల్లరి చెల్లి అంజు ఉంది.. నా అల్లరి అంజుని మళ్ళీ నాకివ్వు.. ఇక పో

అంతా చూస్తున్న వాణి కళ్ళు తుడుచుకుని లోపలికి వెళ్ళిపోయింది, గౌతమ్ బైటికి వెళ్ళిపోయాడు. వాణి.. కూతురు ఏం చేస్తుందా అని తన రూంలోకి వెళ్లి చూసింది, అంజన తన అన్నయ్య ఫోటో చూస్తూ కళ్ళు తుడుచుకుంటుంటే వెనక్కి తిరిగి తన రూంలోకి వెళ్లి కొంచెంసేపు పడుకుంది. సాయంత్రం మాట్లాడదామని అంజు రూంలోకి వెళ్లి తన పక్కన కూర్చుంది.

అంజు : రెండు నెల్ల నుంచి అస్సలు ఇంట్లో ఉండట్లేదు, అన్నయ్య అన్నది నిజమేనా

అప్పుడే చెల్లి కోసం లోపలికి వచ్చాడు గౌతమ్, వాణి కొడుకుని చూసి లేచి నిలబడింది. గౌతమ్ వెళ్లి అంజు పక్కన కూర్చున్నాడు.

వాణి : మీ నాన్న నన్ను వదిలేసాడు

అంజు : నాన్న వచ్చాడా

వాణి : లేదు ఫోన్ చేసి చెప్పాడు, మనల్ని వదిలేసానని మళ్ళీ రాడట.. నా దారి నాది మీ దారి మీది అని ఫోన్ పెట్టేసాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్. నా పెళ్ళైనప్పటి నుంచి నాది ఒంటరి జీవితమే, నాకంటూ ఎవ్వరు లేరు.. నాకోసం ఎవ్వరు రారు.. ఈ కృష్ణ పరిచయం అయ్యాడు, నేను ప్రేమిస్తున్నా.. నాకు వాడు కావాలి. నేను వాడిని పెళ్లి కూడా చేసుకున్నాను, మీకు ఇష్టంలేకపోతే వెళ్ళిపోతాను.

అంజు : మా కంటే ఎక్కువా

వాణి నవ్వింది తప్ప ఇంకేం మాట్లాడలేదు, రెండు నిమిషాలు అలానే ఉండి కొడుకు కూతురు ఏం మాట్లాడకపోయేసరికి తన రూంలోకి వెళ్ళిపోయింది. అంజన తన అన్న మీద వాలిపోయింది.

అంజు : అన్నయ్యా.. చాలా బాధగా ఉందిరా.. అమ్మా నాన్నా నిజమేనా

గౌతమ్ : నీకేం బాధే, ఏటోళ్ళు అటు పోనీ. నీకు నేను ఉన్నాగా.. నేనుండగా నీకేంటే

అంజు : అమ్మ చాలా మంచిదిరా

గౌతమ్ : మీ అమ్మ ఎంత మంచిదో నాకు తెలుసులే

అంజు : అలా అనకు రా.. నన్ను చాలా బాగా చూసుకుంటది

గౌతమ్ : ఎప్పుడూ

అంజు : ఏమో అన్నా.. నాకెలాగో ఉంది.. ప్లీజ్ ఆయన ఎలాగో చిన్నప్పటి నుంచి మన దెగ్గర ఎప్పుడు ఉండలేదు కానీ అమ్మ మనతోనే కదరా ఉంది.. ఎప్పుడు మనతో ఏమి పంచుకొని అమ్మ నాకంటూ ఎవ్వరు లేరు, నా కోసం ఎవరు రారు అంది.. మనం తప్ప తనకి చుట్టాలు, స్నేహితులు ఎవ్వరు లేరు.. ప్లీజ్ అన్నయ్యా

గౌతమ్ : నన్నేం చెయ్యమంటావ్

అంజు : ప్లీజ్ అన్నా.. అని మోకాళ్ళ మీద కూర్చుంది.. నేను కొన్ని రోజులు హాస్టల్లో ఉంటాను, నాకు కొంచెం టైం కావాలి. చేతులారా నేను పోగొట్టుకున్న నా చదువుని నా అత్మాభిమానాన్ని నేను మళ్ళీ నిలబెట్టుకుంటాను.. అప్పటివరకు హాస్టల్లోనే ఉంటాను. నువ్వు అమ్మని దెగ్గరికి తీసుకో.. నా కోసం

గౌతమ్ : నేను చాలా బిజీగా ఉన్నాను అంజు

అంజు : ఒక్కసారి ఆలోచించరా.. మనం కూడా కాదనుకుంటే తను ఎటు పోతుంది.. కనీసం నన్ను కన్నది కదా అందుకైనా నేను తన బాధ్యత తీసుకోవాలి కదా, ఇంకెలా చెప్పాలి నీకు

గౌతమ్ : సరే ఒకసారి ట్రై చేస్తాను అంతే.. నువ్వేమి ఎటు వెళ్లనవసరం లేదు, ఇంట్లోనే ఉండు

అంజు : లేదు నేను కొన్ని రోజులు ఒంటరిగానే ఉంటాను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు.. ఈ సారి నా జాగ్రత్తలో నేనుంటాను.. ఈ ఒక్కసారి నన్ను నమ్ము.. నీ అంజుని నీకు ఇచ్చేస్తాను.

గౌతమ్ : సరే నీ ఇష్టం.. కానీ హాస్టల్లో కాదు.. నేను ఏర్పాటు చేస్తాను, నువ్వు అక్కడే ఉండాలి.

ఓకే అంటూ అన్నయ్య ఒడిలో వాలిపోయింది.

అంజు : లవ్ యు అని గుండె మీద ముద్దు పెట్టుకున్నాను, ఎందుకో నా గుండె వేగంగా కొట్టుకున్నట్టు అనిపించింది. అన్నయ్యని అలానే వాటేసుకున్నాను.

రెండు రోజుల తరువాత అంజనని కాలజీ దెగ్గరలో నా ఫ్రెండ్ సీతారామ్ ఇంటి పైన పెంట్ హౌస్లో వదిలి తన చెల్లికి అప్పగించి వచ్చాను. సీతారామ్ జాగ్రత్తగా చూసుకుంటానని మాటిచ్చాడు. బైటికి వస్తూనే రాజుకి ఫోన్ చెసాను.

గౌతమ్ : ఎక్కడున్నావ్ రా

రాజు : ఇంట్లో ఉండట్లేదని, నా కెరీర్ ఏంటని ఒకటే గొడవ మా వాళ్ళు

గౌతమ్ : పట్టించుకునేవాళ్ళు ఉండాలన్నా అదృష్టం ఉండాలి, నీకు ఉంది

రాజు : చెప్పు, ఏంటి విషయం.. అవసరం లేకపోతే నేను గుర్తురాను కదా

గౌతమ్ : పనుంది రా కలుద్దాం, దానికంటే ముందు నీకొక ఫోటో పంపిస్తున్నా.. పేరు గిరి, నార్త్ రైల్వేలో పనిచేస్తున్నాడు.. ఎక్కడ పని చేస్తాడు, ఏ టైం నుంచి ఏ టైం దాకా పని చేస్తాడు.. ఎక్కడ ఉంటాడు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి.

రాజు : మ్యాటర్ ఏంటి..?

గౌతమ్ : చెప్తాను

రాజు : ఓకే