బిందు తన కడుపులో ఉన్న బిడ్డ అర్ధాంతరంగా చనిపోవడంతో తన ముందు ఉన్న అద్దం మీద తన పౌడర్ డబ్బా తీసుకోని విసిరి కొట్టి గట్టిగా అరిచింది అది విన్న బిందు వాళ్ల అమ్మ అన్నపూర్ణ కిచెన్ లో నుంచి బయటకు పరుగులు తీస్తూ వస్తుంటే, ఆమెను ఆగమని సైగ చేశాడు బిందు వాళ్ల నాన్న కృష్ణమూర్తి దాంతో అన్నపూర్ణ “ఏమండీ అది ఇలాగే ఉంటే పిచ్చిది అయిపోతుంది అండీ పెళ్లి కీ కొన్ని రోజులు ఆగుదాం అండీ లేదు అంటే మళ్లీ దాని అత్తవారిల్లు లో మనకు మాట వస్తుంది” అని చెప్పింది, దానికి కృష్ణమూర్తి “నువ్వు నోరు మూసుకుని మూలకు కూర్చో అంతే కానీ లేనిపోని సలహాలు ఇవ్వాల్సిన పని లేదు, అది ఇప్పుడు చేసిన పనికే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియడం లేదు మన అదృష్టం కొద్దీ ఆ దరిద్రం కాస్త ఎక్కువ రోజులు లేకుండా తొందరగా పోయింది, ఇంక దాని అత్తవారిల్లు గురించి ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు వాడికి ముందుకు వెనుక ఎవరు లేరు అందుకే కావాలని అలాంటి వాడిని వెతికి మరి పెళ్లి సంబంధం చూశాను, దానికి చెప్పు పిచ్చి పిచ్చి పనులు చేయకుండా మర్యాద గా ఆదివారం పెళ్లి చూపులకు తయారు అవ్వమని చెప్పు ఒకవేళ ఎమైన తేడా వస్తే నేను చావడం మాత్రమే కాదు నాతో పాటు మీ ఇద్దరిని కూడా తీసుకోని పోతా జాగ్రత్త పోయి దానికి ఏమైనా తినిపించు” అని చెప్పి లాక్ వేసిన బిందు రూమ్ యొక్క రూమ్ తాళం అన్నపూర్ణ చేతిలో పెట్టి బయటికి వెళ్లాడు కృష్ణమూర్తి.
బెడ్ మీద పడుకుని ఏడుస్తూ ఉంది బిందు అలా తన ఫోన్ చేతిలోకి తీసుకుని దాంట్లో wallpaper లో తన బాయ్ ఫ్రెండ్ బాలు తో కలిసి దిగిన ఫోటో వైపు చూసి ఫోన్ నీ విసిరి కొట్టింది బిందు అలా దిండు లో మొహం దాచుకొని ఏడుస్తూ ఉంది బిందు అలా చెంప మీద నుంచి జారుతూ ఉన్న ఆమె కంటి నీరు నుంచి తన ఆలోచనలు కూడా గతంలోకి ప్రయాణం అయ్యాయి.
(ఏడు నెలల క్రితం)
బిందు కాలేజీ పూర్తి కాక ముందే క్యాంపస్ placement లో ఉద్యోగం వచ్చింది దాంతో మొదటి రోజు ఉత్సాహం గా ఆఫీసు కీ ప్రయాణం మొదలు పెట్టింది బిందు కానీ ఆమె తండ్రి కృష్ణమూర్తి “నువ్వు ఇప్పుడు అంత కంగారు గా ఉద్యోగం చేసి ఎవరిని ఉద్ధరించాలి పెళ్లి చేసుకోని నీ మొగుడికి సేవలు చేయాల్సిందేగా” అని అన్నాడు, దానికి బిందు “మరి ఆ మాత్రం దానికి ఎందుకు ఇంజనీరింగ్ చదివించావు నాన్న పెద్ద మనిషి అయిన తర్వాత పెళ్లి చేయాల్సిందిగా, తాత నీకు అమ్మ నీ ఇచ్చి చేసినట్లు లేదా చదువు మాన్పించి ఇంట్లో పెట్టాల్సింది నీకు కట్నం ఇంకా డబ్బులు మిగిలేవి నీ బాధ ఏమీ లేదు నా తరువాత పిల్లలు పుట్టలేదు నీకు వారసులు లేరు నీకు కొడుకు పుట్టి ఉంటే వాడి సంపాదన నీకు తోడు అయ్యేది కానీ అలా జరగలేదు అందుకే నీ frustration నన్ను ఏదో అనకపోతే ముద్ద దిగదు కదా, నేను సంపాదించేది కూడా నీకోసమే నా జీతం లో నేను నా ఖర్చులకు ఒక ఐదు వేలు పెట్టుకొని మిగితాది నీకే ఇస్తాను ఏమీ దిగులు పడవద్దు” అని చెప్పి ఆఫీసు cab వస్తే దాంట్లో ఆఫీసు కీ బయలుదేరింది బిందు, ఇది అంత విని కిచెన్ లో చిన్నగా నవ్వుతూ ఉంది అన్నపూర్ణ, “చూశావా నీ కూతురు కీ నోరు ఎంత పెరిగిపోయిందో చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడుతుంది కానీ కానీ ఎక్కడి దాక పోతుందో చూద్దాం ఏమైన తేడా జరగాలి దానికి నీకు ఇద్దరికి నా విశ్వరూపం చూపిస్తా” అని అన్నాడు కృష్ణమూర్తి.
ఆఫీసు కీ వెళ్లిన బిందు వెళ్లి తన table దెగ్గర కూర్చుని తన సామాన్లు సర్దుకుంటు ఉంటే అప్పుడే తన table మీద ఎవరో ఒక రోజా పువ్వు పెట్టి దాని కింద Welcome అని ఒక greeting card పెట్టారు దాంతో బిందు కీ ఏమీ అర్థం కాలేదు, అప్పుడు చుట్టూ చూస్తే ఒకడు బిందు వైపు నవ్వుతూ దొంగ చూపులు చూస్తూ ఉన్నాడు దాంతో బిందు కీ అది ఎవరి పని అని అర్థం అయ్యింది వెంటనే ఆ రోజా పువ్వు card తీసుకోని వెళ్లి “మొదటి రోజే గొడవ పడే ఉద్దేశం నాకూ లేదు ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే మర్యాదగా ఉండదు అని చెప్పి ఆ card నీ చింపి పడేసి ఆ రోజా పువ్వు నీ విసిరి కొట్టింది బిందు, ఆ తర్వాత కొద్దిసేపు తరువాత HR వచ్చి బిందు నీ తన టీం లీడర్ అయిన బాలు దగ్గరికి తీసుకోని వెళ్లింది, అప్పుడే మొదటి సారి బిందు, బాలు నీ చూసింది తెల్లగా ఆరు అడుగుల ఎత్తు చూడడానికి ఏదో బాలీవుడ్ హీరో లాగా ఉన్నాడు, దాంతో బిందు కీ ఎక్కడో కుర్రాడు బాగున్నాడు అనే ఒక భావన మొదలు అయ్యింది, అప్పుడు బాలు బిందు మొహం మీద చిటికె వేస్తూ “నన్ను చూసింది చాలు ఇది ప్రాజెక్టు ఫైల్ రెండు రోజుల్లో presentation ఇవ్వాలి స్టడీ చేసి ppt రెడీ చెయ్యి రేపు మధ్యాహ్నం కీ అయిపోవాలి” అని చెప్పి తిరిగి తన కంప్యూటర్ లో పనికి వెళ్లిపోయాడు బాలు.
దానికి బిందు మనసులో “వీడు ఏంటి సాఫ్ట్ వేర్ ఆఫీసు లో టీం లీడర్ గా ఉండి ఏదో ఇంటర్నేషనల్ టీం కీ టీం లీడర్ లాగా బిల్డప్ ఇస్తున్నాడు” అని అనుకుంది, అప్పుడు బాలు “నేను అలా ఇంటర్నేషనల్ టీం కీ లీడర్ లాగా ఫీల్ అవుతున్న కాబట్టే ఈ కంపెనీ లో ఈ టీం కీ ఒక మంచి ఇమేజ్ ఉంది దాని నీ inexperience తో పాడు చేయకు” అని అన్నాడు, దాంతో బిందు షాక్ అయ్యి అక్కడి నుంచి వెళ్లి తన పనిలో తాను ఉన్న కూడా తన చూపులు మాత్రం బాలు వైపే వెళుతున్నాయ్, అతని చుట్టూ ప్రళయం వచ్చిన అతని పనిలో అతను నిమగ్నం అయ్యి ఉన్నాడు, “వాడిని చూసి ఊరికే టైమ్ వేస్ట్ చేసుకోకు వాడు వాడి నీ తప్ప ఎవరినీ పట్టించుకోడు” అని బిందు పక్కన అమ్మాయి చెప్పింది, కానీ బిందు ఆలోచనలో మొత్తం బాలు నిండి పోయాడు అలా రెండు రోజుల తరువాత బిందు ppt తయారు చేసి ఆఫీసు లో presentation కీ వెళుతూ ఉండగా తన తండ్రి కీ accident అయ్యింది అని ఫోన్ వచ్చింది దాంతో బిందు ఎవరికి చెప్పకుండా హాస్పిటల్ కి వెళ్ళింది ఇక్కడ కాన్ఫరెన్స్ హాలులో అందరూ తన కోసం ఎదురుచూస్తున్నారు, వాళ్ల బాస్ బాలు నీ తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు దాంతో బాలు గట్టిగా పిడికిలి బిగించి తన చేతిలో ఉన్న ఫోన్ నీ విసిరి కొట్టాడు.
బాలు తనకు జరిగిన అవమానానికి చాలా కృంగి పోయాడు ఈ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే తనకు కంపెనీ లో చాలా పెద్ద పోస్ట్ లో ప్రమోషన్ వస్తుంది అని ఇన్ని రోజులు పాటు విశ్రాంతి లేకుండా వేరే ఏమీ ఆలోచించకుండా మూడు సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డాడు అలాంటి తన కళ ఇప్పుడు కంటి ముందే పేక మేడ లాగా కూలి పోయింది, దాంతో బాలు కీ కోపం ఎక్కువ అయ్యి బాల్కనీ లో నిలబడి సిగరెట్ వెలిగించి గట్టిగా పీల్చీ పొగలు వదులుతు ఉన్నాడు అప్పుడే ఆఫీసు కీ వచ్చిన బిందు కాన్ఫరెన్స్ హాలులో వెళ్లి చూస్తే అక్కడ ఎవరూ లేరు అప్పుడు HR వచ్చి “మీటింగ్ ఉన్నపుడు నువ్వు రావాలి నువ్వు వచ్చినప్పుడు మీటింగ్ ఉండదు నీ వల్ల కంపెనీ కీ రెండు వందల కోట్ల డీల్ పోయింది, పాపం ఈ ప్రాజెక్ట్ కనుక ఓకే చేసినట్లు అయితే మూడు సంవత్సరాలుగా బాలు ఆశ పడుతున్న అతని ప్రమోషన్ అతనికి వచ్చేది నువ్వు చేసినదానికి నిన్ను జాబ్ లో నుంచి తీసేయాలి కానీ MD శేఖర్ సార్ దయ వల్ల నువ్వు ఇంకా జాబ్ లో ఉన్నావు” అని చెప్పింది HR మాళవిక, దాంతో బిందు తన వల్ల బాలు కీ జరిగిన నష్టం కీ వెళ్ళి అతనికి సారీ చెప్పడానికి వెళ్లింది.
“నువ్వు ఆకాశానికి నిచ్చెన వేయడం మానేయ్, నీ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు, నువ్వు అనవసరంగా ఈ పరుగు పందెం లో నాతో పోటీ పడుతున్నావ్, ఓటమి నీ అలవాటు చేసుకో నీకు ముందు ముందు చాలా కోల్పోయే అవకాశం ఉంది” అని ఇందాక శేఖర్ చెప్పిన మాటలు బాలు తల లో తిరుగుతూ ఉన్నాయి, అప్పుడే అక్కడికి వచ్చిన బిందు వెళ్లి బాలు పక్కన నిలబడి “సారీ బాలు నేను నీకు inform చేసి ఉండాల్సింది మా నాన్న కీ accident అవ్వడం వల్ల కంగారు లో వెళ్లిపోయాను, నేను చేసింది పెద్ద తప్పే దానికి నేను ఇంతకంటే పెద్ద ప్రాజెక్ట్ తీసుకోని రావడానికి నీకు కచ్చితంగా సహాయం చేస్తాను” అని బిందు చెప్పగానే, బాలు తన చేతిలో ఉన్న సిగరెట్ నీ విసిరి కొట్టి బిందు జుట్టు పట్టుకొని దగ్గరికి లాగి బిందు కీ పెదవి పైన ముద్దు పెట్టి గట్టిగా తన పెదవి మధ్యలో బిందు పెదవులు పెట్టి జుర్రుకుంటు ఉన్నాడు బాలు, దాంతో బిందు వాడిని పక్కకు తోసి బాలు నీ కొట్టి అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్లి బాత్రూం లో తన మొహం మీద నీలు కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంది అలా కొద్ది సేపు అక్కడే ఉండి బయటకి వచ్చిన తర్వాత, మాళవిక వచ్చి బిందు నీ శేఖర్ పీలుస్తున్నాడు అని చెప్పి MD రూమ్ లోకి తీసుకోని వెళ్లింది, దాంతో అక్కడ ఉన్న శేఖర్ “మిస్ బిందు మీరు చేసిన తప్పుకు శిక్ష ఉండాలి కదా” అని చెప్పి ఒక పేపర్ ముందుకు తోసాడు ఏంటి అని చూస్తే అందులో బిందు నీ HR గా ప్రమోట్ చేస్తున్నట్లు ఉంది, దాంతో మాళవిక షాక్ లో ఉండగా బిందు కూడా షాక్ అయ్యి “సార్ నేను వచ్చిందే రెండు రోజుల ముందు నను అప్పుడే HR చేయడం ఏంటి సార్ నాకూ ఏమీ experience ఉంది నా వల్ల కంపెనీ కీ లాస్ వస్తుంది సార్” అని చెప్పింది బిందు.
దానికి శేఖర్ “అది నేను చూసుకుంటాను కాకపోతే మీ వల్ల లాస్ ఆ looser బాలు గాడికి పడాలి లేదు అంటే ఈ కంపెనీ లోనే కాదు ఏ కంపెనీ లో నీకు భవిష్యత్తు ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి” అని చెప్పాడు, దానికి బిందు కీ ఒక విషయం అర్థం అయ్యింది శేఖర్, బాలు మధ్య ఏదో బలమైన గొడవ ఉంది అని అనిపించింది, దాంతో ఎలాగైనా బాలు నీ గెలిపించాలని బిందు ఆ రోజు నుంచి శేఖర్ టీం లో ఉండి బాలు కీ సహాయం చేయాలని నిర్ణయం తీసుకుంది అలా మొత్తం తన టీం లో అందరినీ ఇంకా కష్టపడమని చెప్పి బెంగళూరు లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కీ నాలుగు వందల కోట్లు టర్నోవర్ ఉంది ఆ కంపెనీ కీ హైదరాబాద్ లో వేరే కంపెనీ తో collaborate చేయాలని చూస్తోంది అని తెలిసి బిందు ఆ కంపెనీ తాలూకు వివరాలను బాలు కీ పంపింది, అప్పుడు బాలు ఇదే సరైన ఛాన్స్ అనుకోని ఎవరికి తెలియకుండా బెంగళూరు కీ వెళ్ళి పని పూర్తి చేయాలని చూస్తే శేఖర్ కీ ఈ విషయాన్ని కావాలి అని చెప్పి బిందు కూడా బెంగళూరు కీ వెళ్లింది.
అక్కడ బాలు “నువ్వు అమ్మాయి వీ కాబట్టి నీకు ఆఫర్స్ తేలికగా వస్తాయి నా పరిస్థితి అలా కాదు నాకూ ఈ డీల్ చాలా అవసరం” అని అన్నాడు, దానికి బిందు “నేను నీకు హెల్ప్ చెయ్యాలి అనే వచ్చాను నేను శేఖర్ టీం లో ఉంటూ నీకు సహాయం చేస్తున్న నువ్వు కాన్ఫరెన్స్ పూర్తి చేసుకొని ఫోన్ చెయ్యి నేను బళ్లారి లో మా అంకుల్ వాళ్ల ఇంట్లో ఉంటాను” అని చెప్పి బళ్లారి కీ వెళ్లింది బిందు, అక్కడ తను బస్ దిగిన వెంటనే తన అంకుల్ కీ ఫోన్ చేస్తే ఆయన కొంచెం టైమ్ పడుతుంది అన్నాడు, అప్పుడే కొంతమంది బిందు నీ కామెంట్ చేస్తున్నారు దాంతో తను scarf తో మొహం కప్పుకుంది వాళ్లు మళ్లీ కామెంట్ చేస్తే వాళ్ళని కొట్టడానికి వెళ్లింది కానీ వాళ్లు బిందు చెయ్యి పట్టుకుని తన ఒంటి మీద చెయ్యి వేయబోతు ఉంటే అప్పుడే సూర్య వచ్చి వాళ్లను కొట్టాడు, సూర్య నీ చూసి అందరూ పారిపోయారు దాంతో సూర్య తన బస్ కీ టైమ్ అయ్యింది అని చెప్పి బిందు వైపు కూడా చూడకుండా వెళ్లి బస్ ఎక్కాడు.
బెంగళూరు లో మీటింగ్ సక్సెస్ అవ్వడం తో బాలు, బిందు కీ ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో పార్టీ ఇస్తాను అని చెప్పాడు, దాంతో బిందు వెళ్లింది అప్పుడు బాలు తనకు బిందు మీద ఉన్న ఫీలింగ్ చెప్పాడు, దాంతో బిందు కూడా తన ఇష్టం నీ ఒక ముద్దు రూపం లో తెలిపింది ఆ తర్వాత ఇద్దరూ ఆ రాత్రి కలిశారు, ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లిన తర్వాత మాళవిక మేనేజర్ అయ్యింది, కానీ బాలు అసలు ఆఫీసు లో కనిపించలేదు ఫోన్ చేస్తే response లేదు అలా ఉండగా ఒక రోజు తను pregnant అని బిందు కీ తెలిసి బాలు నీ ఎలా కలవాలి అని చూస్తూ ఉంటే రోడ్డు మీద అందరి దెగ్గర అడ్డుకుంటు కనిపించాడు శేఖర్, దాంతో బిందు వెళ్లి శేఖర్ నీ కలిసి ఏమీ జరిగింది అని అడిగితే, దానికి శేఖర్ తను ఇలా అవ్వడానికి కారణం కొత్త చైర్మన్ అని ఆ చైర్మన్ ఎవరో కాదు బాలు అని వాడు శేఖర్ తమ్ముడూ అని తెలిసి షాక్ అయ్యింది బిందు.