రష్ అవర్ 2

నా జీవితం నా భర్త సందీప్ చేతుల్లోకి….

నా పేరు రష్, ఇవ్వాళ నా పెళ్లి రోజు….. నా వయస్సు 19, క్రిష్ వయస్సు 17. హా… క్రిష్ అంటే పెళ్లి కొడుకు కాదు, బండ వెధవ, మా అత్తా కొడుకు. ఆకలవుతుంది తినడానికి ఏమైనా తెచ్చిపెట్టారా అంటే, ప్లేట్ లో మొత్తం పెట్టుకొని తీసుకొని వచ్చాడు. అత్త చూసి పంతులుని అడిగాము పెళ్లి అయ్యే వరకు తినకూడదు అని చెప్పింది. వీడు ఆ ప్లేట్ తీసుకొని నా ఎదురుగా కూర్చొని తింటున్నాడు. కొద్ది సేపటికి ఒక సారి “రష్ కూర వడ్డించు”, “మంచి నీళ్ళు యివ్వు” అంటూ నా ఎదురుగా కూర్చొని తింటున్నాడు.

అప్పుడే నా గదిలోకి వచ్చిన వాళ్ళు, “ఏంటి అమ్మాయి, ఇక్కడే కూర్చున్నావ్”

నేను మాట్లాడక ముందే, క్రిష్ “కష్ట పడి మెక్ అప్ వేశారు, బయటకు వెళ్ళింది అనుకో… చమట పట్టి ఒరిజినల్ మొహం బయట పడుతుంది అని AC గదిలో కూర్చోమన్నారు” అన్నాడు.

వాడి వెనకే కొంత మంది కోతి మూక చేరారు. పిన్నీ చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు, నా చెల్లెలు అందరూ వాడి వైపే ఉండి నన్ను మరింతగా ఏడిపించే పనిలో పడ్డారు.

క్రిష్ వేళ్ళు నాక్కుంటూ “రష్, సాంబార్ వడ్డించు” అన్నాడు.

మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోవడంతో నేను, నా చెల్లెలు ఎక్కువగా అత్త దగ్గర పెరిగాము.

నాన్న రామ్మోహన్ (నార్కోటిక్ డిపార్టుమెంటు SI రేంజ్ ఆఫీసర్) ఉద్యోగ రిత్యా ట్రాన్సఫర్ లు ఎక్కువ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడు.

అప్పుడు క్రిష్ తో నాకు చనువు పెరిగింది. చిన్నప్పటి వరకు బాగా క్లోజ్ గానే ఉండేవాళ్ళం అంట.

సరిగ్గా నా 12వ ఏట… వాడు 10. ఇద్దరం చాక్లెట్ కొనుక్కోవడానికి అని వెళ్లి రోడ్డు మీద జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నాం అంట.

కారణం నాకు గుర్తు లేదు. అక్కడ ఉన్న జనం చూసి అత్తకు చెప్పారు. అత్త చీపురు కట్ట చేత్తో పట్టుకొని మా కోసం వచ్చింది.

ఇద్దరం చెరో వైపు పరిగెత్తాం. ఆ రోజే అర్ధం అయింది మా దారులు అక్కడితో వేరు అయ్యాయి అని.

నన్ను తిట్టారు, క్రిష్ ఇంటికి రాగానే అత్త బాది పడేసింది. నన్ను కొట్టలేదు అని కోపమొచ్చి నా చేయి కొరికి పరిగెత్తాడు. ఇంకేముంది అత్త మళ్ళి చీపురు తీసుకొని బయలు దేరింది.

సందు చివర దొరికాడు అంట, కొట్టుకుంటూ తీసుకొచ్చింది. అప్పటి నుండి నన్ను ఎదో ఒకటి చేయడం… నేను ఎదో ఒకటి చేయడం… మా ఇద్దరి మధ్య మామూలు అయి పోయింది.

నా 12వ ఏట మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు, నాకు పిన్నీ వచ్చింది. తెల్లగా యాపిల్ పండు ఉన్నట్టు ఉంది. నేనే చూస్తున్నాను అంటే, క్రిష్ నోరు తెరుచుకొని సొంగ కార్చుకుంటూ చూస్తున్నాడు.

పిన్నికి ముగ్గురు చెల్లెళ్ళు, నేను నా చెల్లెలు…. అందరిని నాన్న సిటీకి తీసుకొని వెళ్ళాడు. ఇంట్లో నాన్న ఒక్కడు, మా పిన్నితో కలిపి అరడజను మందిమి వయస్సుల వారిగా ఆడపటాలం కనిపిస్తూ ఉంటాం.

మా నాన్నకి మగపిల్లల మీద మక్కువతో క్రిష్ (అత్త కొడుకు) మరియు కేశవ్ (పెదనాన్న కొడుకు) లను తీసుకొని వచ్చే వాడు.

అత్త ఇంట్లో ఉండడం అంటే, చక్కగా వండి పెడుతుంది, తినడం… బజార్లు వెంట పడి తిరగడం మా పని. పల్లెటూరు కాబట్టి మాకు కూడా బాగుండేది.

మా నాన్న దగ్గర క్రిష్ కి సొంగ పడుతుంది, కేశవ్ అన్న తేలికగా అడ్జస్ట్ అయ్యాడు.

పిన్నీ అందరిని బాగానే చూస్తుంది. కాని టైం కి లేవాలి, అన్ని టైం టూ టైం జరగాలి. నాన్న మాత్రం క్రిష్ ని, కేశవ్ ని పొద్దున్నే తీసుకొని వెళ్లి ట్రైనింగ్ అంటూ సొంగ పడేలా ఎక్సరసైజ్ చేయించి తీసుకొని వచ్చేవాడు.

పైగా పనిష్ మెంట్ కూడా ఇచ్చేవాడు. కేశవ్ అన్న ఓకే అనుకున్నా…. క్రిష్ మాత్రం ఏడుపు మొహం వేసుకొని వచ్చేవాడు. వాడిని చూస్తే నాకు కూడా జాలి వేసేది.

మొత్తానికి ఒక రోజు మా నాన్నతో గొడవ పడి నేను రాను ఇంకోసారి మీ ఇంటికి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంట్లో అందరం బయటకు వెళ్లి వెతికితే పక్కింటి క్యారంబోర్డ్ ఆడుతున్నాడు దున్నపోతోడు. వాళ్ళ ఇంట్లోనే తిని సాయంత్రం తీరికగా వచ్చాడు.

మామ ఇక ఏం చెప్పలేక, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వదిలేసి వచ్చాడు.

కాని చెప్పాను కదా మా ఇంట్లో ఆడపటాలం అని ప్రతి ఆరు నెలలకు ఒక సారి ఫంక్షన్…. సవర్తి, నిశ్చితార్దం, పెళ్లి, పురుళ్ళు, వచ్చిన వాళ్ళకు మళ్ళి పుట్టిన రోజులు అని సంవత్సరానికి రెండూ ఫంక్షన్స్ మినిమమ్ ఉంటాయి. క్రిష్ ప్రతి దానికి వచ్చే వాడు. వాడికి నాకు ఎప్పుడూ గొడవ ఉండేది.

ఏం చెప్పినా చేసే వాడు కాదు, నాకు కోపం వచ్చేది. అలా చెయ్, ఇలా ఉండు అంటే ఒహుం వినే వాడు కాదు. అందుకే నాకు కోపం వచ్చేసేది. మా ఇద్దరి మధ్య గొడవలు తీర్చడానికి కేశవ్ అన్నయ్య క్రిష్ ఇద్దరూ కొట్టుకునే వాళ్ళు.

క్రిష్ వెళ్లి పోతే నాకు దిగులుగా అనిపించేది. వాడు అంటే ఇష్టమే, కాని వాడు అంటే ద్వేషం కూడా.

పదవ తరగతి పరిక్షలు అప్పుడు కూడా నీకెన్ని వచ్చాయి రష్….. నీకంటే ఎక్కువ తెచ్చుకుంటా అని వెళ్ళే వాడు. నేను దేవుడికి ఎక్స్టా కొబ్బరి కాయ కొట్టి వీడికి నా కంటే మార్కులు తక్కువ రావాలి, అవసరం అయితే తప్పాలి అని దండం పెట్టుకునే దాన్ని.

రోజులు వేగంగా గడిచిపోయాయి. మా పిన్నీ చెల్లెళ్ళు అందరూ అయిపోయి నా వంతు వచ్చింది, నా వెనక నా చెల్లెలు ఉంది.

పెళ్లి సంగతి రాగానే భయం వేసింది, ఆలోచించాను…. ఆలోచించాను…. నాకు ఎంత ఆలోచించినా ఎవరి ఫోటో నాకు నచ్చడం లేదు. నచ్చకపోవడం కాదు నిజానికి నేను ప్రతి ఒక్కరిని క్రిష్ ని సరిపోల్చుకొని వద్దు అని చెబుతున్నాను.

క్రిష్ అంటే నాకు కోపం, ద్వేషం ఇది బయటకు మాత్రమె…. ఎందుకో తెలియదు. ఒక రోజు క్రిష్ ని తిట్టుకుంటూ నిద్ర పోయాక…. కలలో క్రిష్ నాతో చేయకూడని తప్పు చేశాడు. అతన్ని నా భర్త స్థానంలో చూసినట్టు మేం సంతోషంగా ఉన్నట్టు కల వచ్చింది.

క్రిష్ మనసులో ఉన్నది నాకు మైండ్ వాయిస్ వినపడుతుంది. వాడు ఎప్పుడూ నన్ను తిట్టుకుంటూ ఉండే వాడు.

ఆలోచించగా…. ఆలోచించగా…. క్రిష్ అంటే నాకు ఇన్నాళ్ళు ఉంది ద్వేషం కాదు ఇష్టం…. ప్రేమ అని అర్ధం చేసుకున్నాను. కాని ఎవరికీ చెప్పలేను. వాడు నాకంటే రెండూ సంవత్సరాలు చిన్న, అప్పుడప్పుడు అనిపిస్తుంది. నేను మగాడు వాడు ఆడపిల్ల అయితే…. అమాంతం లేపుకొని పోయి పిల్లల్ని కనేయాలని అనిపించేది.

అందుకే క్రిష్ ని మర్చి పోవడం కోసమే సందీప్ ఫోటో ఓకే చేశాను. ఈ రోజు పెళ్లిలో కూడా క్రిష్ వచ్చి నా ఎదురుగా కూర్చొని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు.

విషయం తెలుసుకున్న కేశవ్ అన్న, వచ్చి క్రిష్ ని అరవబోయాడు. నేను చేయి చూపించి ఆపమని చెప్పి వాడికి వడ్డించాను. అందరూ సెంటిమెంట్ ఫీల్ అయి వెళ్ళిపోయారు.

తర్వాత కొద్ది సేపటికి పెళ్లి తంతు జరుగుతుంది క్రిష్ కనిపించలేదు, ఎక్కడో ఎదో పని చేస్తూ ఉన్నాడు అంట. ఆలోచిస్తూనే నా మేడలో సందీప్ తాళి కట్టేశాడు.

అప్పగింతలు అప్పుడు కనిపించాడు. అందరిని చూస్తూ ఏడ్చేశాను.

క్రిష్ ని చూసినపుడు అతని మైండ్ వాయిస్ వినపడింది.

క్రిష్ “ఎందుకు నన్ను అలా చూస్తున్నావ్… నేను నిన్ను ఇష్టపడ్డట్టు, నువ్వు కూడా నన్ను ఇష్టపడ్డావా…” అనుకున్నాడు.

అన్నింటి కంటే అప్పుడే ఎక్కువ ఏడుపు వచ్చింది, ‘మరి నీ మనసులో ఉన్నప్పుడు నా ముందు ఎందుకు రా తిట్టుకున్నావ్, నా ముందు నీ మనసులో అయినా కనీనం నీ ప్రేమ గురించి ఒక్క సారి అయినా తలుచుకొని ఉండి ఉంటె బాగుండేది కదా…’ అనుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాను.

ఐ హెట్ యు క్రిష్…., ఐ హెట్ యు…., ఐ రియల్లీ డూ….

ఏడుస్తూనే కార్ ఎక్కాను. ఆ రోజు అల్లా ఆలోచిస్తూ అలానే ఏడుస్తూ ఉన్నాను. మరుసటి రోజుకు క్రిష్ ని మరచిపోవాలని అనుకోని నా భర్త సందీప్ భుజంపై తలని వాల్చాను. క్రిష్ ఆలోచనలు నా మనసు నుండి పోవడం లేదు.

ఇవ్వాళ సందీప్ తో నా తోలి రాత్రి

సందీప్ నన్ను పూర్తిగా క్రిష్ ఆలోచనల నుండి బయట వేస్తాడు, అనుకుంటూ పాల గ్లాస్ తో గదిలోకి అడుగుపెట్టాను.

ఒక స్త్రీ, తను ప్రేమిస్తున్న వ్యక్తిని ఎందుకు కోప్పడుతుంది, ద్వేషిస్తుంది అంటే….
అతని మీద ఆమెకు విపరీతమైనా ఎక్సపెక్టేషన్ ఉంది.
లేదా అతని నుండి ఆమెకు అనుకున్నంత ప్రేమ రావడం లేదు.

ex. దున్నపోతోడు అర్ధం చేసుకోడు.
ఎంత ప్రేమ చనువు లేకపోతే దున్నపోతు అంటుంది. కాని అదేం ఉండదు.
అబ్బాయికి ఆ అమ్మాయికి నేను ఇష్టం లేదు అని బ్రాండ్ వేసేసుకుంటాడు.

చాలా మంది అమ్మాయిల వన్ సైడ్ లవ్ స్టోరీస్ ఇలానే ఆగిపోతాయి.

అమ్మాయికైనా, అబ్బాయికైనా సరే….
ప్రేమను ఎక్సప్రెస్ చేయలేకపోతే వన్ డే యు విల్ మిస్….

మీరు గెస్ చేసింది కరక్టే సందీప్ అన్ ఫిట్ ఫర్ సెక్స్…

గేం స్టార్ట్ అయింది…..